Spring Onians : ఉల్లి కాడల్లోనూ పోషకాలు ఫుల్..! తింటే కలిగే ప్రయోజనాలివే..

Spring Onians : ఉల్లికాడల్లో పోషకాలు ఫుల్..! తింటే కలిగే ప్రయోజనాలివే..

Update: 2024-10-23 10:10 GMT

దిశ, ఫీచర్స్ : ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. కానీ ఆకుపచ్చని రంగులో ఉండే ఉల్లికాడల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నందున ఉల్లి కాడలను తింటే అనేక బెనిఫిట్స్ ఉంటాయి.

ఉల్లిపంట కోతకు రాకముందు ఉండే దశలోని వాటి మొక్కలనే ఉల్లికాడలు అంటారు. వీటిని కూరగా వండుకొని తింటారు. అయితే ఇందులోని పోషకాలు, ఔషధ గుణాల రీత్యా అవి ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపు, ప్రేగుల ఆరోగ్యానికి మంచిది. తల, కండరాలు, ఎముకలకు బలం చేకూరుతుంది. మూత్రనాళల్లో నొప్పి, వాపు వంటి సమస్యలను నివారించడంలో ఉల్లికాడలు అద్భుతమైన ఆహారంగా పేర్కొంటారు.

ఉల్లికాడల్లో ఉండే సల్ఫర్ శరీరంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లను, గాయాలను తగ్గించడంలో, రక్త స్రావాన్ని అరికట్టడంలో ఉల్లికాడల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పనిచేస్తాయ్. డయాబెటిస్ రోగులు తింటే షుగర్ అదుపులో ఉంటుంది. యాంటీ పైరేటిక్ లక్షణాలు కలిగి ఉన్నందున ఉల్లికాడలు జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, అవి తగ్గిపోవడానికి గల రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహద పడతాయి. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి శీతాకాలంలో ఎక్కువగా లభించే ఉల్లికాడలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News