ఆర్టిఫిషియల్ నివాసాలు ఏర్పరుచుకుంటున్న దోమలు.. వ్యాధుల వ్యాప్తి వేగవంతం

మానవుల రక్తాన్ని పీల్చే దోమల పేరు చెప్పగానే భయం పుట్టేస్తుంది.

Update: 2023-01-12 12:03 GMT

దిశ, ఫీచర్స్: మానవుల రక్తాన్ని పీల్చే దోమల పేరు చెప్పగానే భయం పుట్టేస్తుంది. అయితే ఇన్నాళ్లు వీటి పెరుగుదలకు అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలే కారణం అనుకున్నాం. క్లైమేజ్ చేంజ్ కూడా దోమల భారీ పెరుగుదలకు కారణమవుతోందని నేచర్ జర్నల్‌లో పబ్లిషైన ఆర్టికల్ స్పష్టం చేసింది. దోమలు వాతావరణ మార్పులకు అనుగుణంగా మనగలుగుతున్నాయని స్పష్టం చేసింది. ఒక అటవీ ప్రాంతంలోని చల్లటి మట్టిగల ప్రదేశంలో వివిధ క్రిమి సంహారకాలు వాడటం, లార్వాలను పరిశీలించడం ద్వారా అధ్యయన కర్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. అంటే క్లయిమేట్ చేంజ్‌కు అనుగుణంగా దోమలు తట్టుకొని మనగలిగితే వాటివల్ల వ్యాధుల వ్యాప్తి కూడా వేగంగా జరుగుతుంది. క్రమంగా సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

దోమల పుట్టుక, పెరుగుదల గురించి తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం అనేక వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్నట్టు వివరించింది. దోమలు ఆయా వాతావరణ పరిస్థితులు, మార్పులను తట్టుకునే విధంగా కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని.. క్లైమేట్ చేంజ్‌ను తట్టుకుని మనగలుగుతున్నాయని.. ఇది ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న సమస్య అని హెచ్చరించింది.

ఒక అడవి ప్రాంతంలోని చల్లటి ప్రదేశంలో దోమలపై నిర్వహించిన పరిశోధన ప్రకారం.. దోమలు వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఆర్టిఫిసియల్ నివాసాలు ఏర్పర్చుకోవడం, క్రమంగా వాతావరణాన్ని అలవాటు చేసుకోవడం వంటివి చేస్తున్నాయి. అంతేకాదు ఇలా క్లైమేజ్ చేంజింగ్‌కు అలవాటు పడిన దోమల లార్వాలను పరిశోధనలో భాగంగా శాస్ర్తవేత్తలు పరిశీలించారు. 24 గంటల్లో అవి అడల్డ్స్ దోమలుగా మారి ప్రభావాన్ని చూపుతాయని గుర్తించారు. ఈ క్రమంలో దోమలు వాతావరణానికి అలవాటు కాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడటానికి, అలాగే దోమల నివారణకు ఏం చేయాలనే విషయంపై అధ్యయనాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.


Similar News