ఏం వర్షాలురా బాబు.. ఎడారి కూడా పచ్చగా మారిపోయింది.. బైబిల్‌లో చెప్పినట్లుగానే..

సౌదీ అరేబియాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఎడారి ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోయింది. ఒకప్పుడు

Update: 2024-04-18 09:44 GMT

దిశ, ఫీచర్స్ : సౌదీ అరేబియాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఎడారి ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోయింది. ఒకప్పుడు నీరు లేక ఈ భూభాగం పూర్తిగా ఇసుక దిబ్బలతో నిండిపోగా.. ప్రస్తుతం ఆకుపచ్చగా మారిపోయింది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు కేరాఫ్‌గా మారింది. మొక్కలు, గడ్డితో ఈ ఏరియా నిండిపోగా.. గ్రీన్ షేడ్స్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.

భారీ ఎడారి భూభాగంలోని పవిత్ర నగరాలైన మక్కా, మసీదులోనే ఈ వింత చోటు చేసుకోవడం విశేషం. వర్షపాతం కారణంగా ఎక్స్‌ట్రా వాటర్ ఇన్‌ఫ్యూషన్ పొడినేలలో వృక్షాల పెరుగుదలను ప్రోత్సహించగా.. కొండలు గ్రీనరీతో కనువిందు చేస్తున్నాయి. ఒంటెలు గడ్డిని మేస్తున్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ అసాధారణ దృశ్యాలను నాసా శాటిలైట్స్ కూడా క్యాప్చర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ‘ఎంత ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఎక్స్‌ట్రా రెయిన్‌ను లైక్ చేయండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొక వ్యక్తి ‘వావ్, బైబిల్ ఈ సంఘటనను ప్రవచించింది. నిజానికి దేవునికి ప్రారంభం, ముగింపు తెలుసు. అరణ్యంలో నీరు, ఎడారిలో ప్రవాహాలు ప్రవహిస్తాయి. మండుతున్న ఇసుక ఒక కొలను అవుతుంది. దాహంతో ఉన్న నేల బుడగలు పుట్టిస్తుంది. యెషయా 35:6-7 NIV’ అని కామెంట్ చేశాడు.


Similar News