స్కిన్ ప్రాబ్లమ్స్‌కు కారణమవుతున్న వర్కవుట్ మిస్టేక్స్
ఏ వ్యక్తికైనా సరే ఫిజికల్ ఫిట్‌నెస్ ముఖ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దిశ, ఫీచర్స్ : ఏ వ్యక్తికైనా సరే ఫిజికల్ ఫిట్‌నెస్ ముఖ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చర్మ సంరక్షణ కూడా అంతే ఇంపార్టెంట్ అని డెర్మటాలజిస్టులు అంటున్నారు. పైగా హెల్తీ రేడియేషన్ స్కిన్ కలిగి ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేస్తున్నవారిలో చాలామంది అలాంటివి పట్టించుకోకపోవడంవల్ల స్కిన్ ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా జిమ్ వెళ్లేముందు మేకప్ చేసుకోవడం, వర్కవుట్స్ వేళ చెమటలు పట్టడంవల్ల టవల్‌తో ముఖాన్ని ఎక్కువసార్లు రుద్దడం, వ్యాయామం తర్వాత ముఖం శుభ్రం చేసుకోకపోవడం లేదా స్నానం చేయకపోవడం, బిగుతుగా ఉండే బట్టలు లేదా హెడ్‌బ్యాండ్‌లు ధరించి వర్కవుట్స్ చేయడం వంటి మిస్టేక్స్ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయని చెప్తున్నారు నిపుణులు. అలాంటి పొరపాట్లు నివారించగలిగితే మేలు జరుగుతుందని అంటున్నారు.
అదే విధంగా సాధారణ జిమ్ గేర్‌లను (మ్యాట్స్, గ్లోవ్స్ మొదలైనవి) ఉపయోగించడంవల్ల బ్యాక్టీరియా, ఫంగల్ స్కిన్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి కారణంగా ముఖం, ఇతర చర్మ భాగాలపై మొటిమలు, ఎర్రటి దద్దుర్లు పెరగవచ్చు. వర్కవుట్స్ వేళ కూడా కొన్ని రకాల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జిమ్ నుంచి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌తో తేలికపాటి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం బెటర్ అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు. ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకుండా కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు శరీరాన్ని చల్లబరచాలని సూచిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మూలంగా వర్కవుట్స్ చేసేవారిలో చర్మ వ్యాధులు, సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
Also Read..