త్వరలో రోజుకు 25 గంటలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి. భూమి 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.

Update: 2024-06-18 06:56 GMT

దిశ, ఫీచర్స్ : సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి. భూమి 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్ష్య తలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. అయితే భూమి తన అక్షం మీద నిలబడుతూ పడమర నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంది. దీని వలన మనకు రోజుకు 24 గంటలు ఏర్పడుతున్నాయి. అంటే ఒక రోజుకు 24 గంటలు.

ఎవరిని అడిగినా రోజుకు 24 గంటలు అనే చెప్తారు. కానీ భవిష్యత్తులో ఒక రోజు 25 గంటలకు పెరగవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వలన భూమి వేగంలో మార్పులు సంభవిస్తున్నాయంట. భూమి వేగం తగ్గుతుందంట. దీని కారణంగా మనకు భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉండవచ్చు అని వారు పేర్కొంటున్నారు. జర్మనీ, మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ప్రకారం.. భూమిలో వేగం తగ్గుతోంది. దీనికారణంగా భవిష్యత్తులో ఒక రోజుకు 25 గంటలు ఉండవచ్చు. 14 లక్షల సంవత్సరాల క్రితం ఒక రోజు అంటే, 18 గంటల 41 నిమిషాలు. ఆ లెక్కలను బట్టి చూస్తే 20 కోట్ల సంవత్సరాల్లో ఒక రోజుకు 25 గంటలు ఉండగలవు అని అంచనా వేస్తున్నట్టు వారు తెలిపారు. అదే విధంగా ఈ విషయాన్ని వారు భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో ఈ మార్పులను అంచనా వేసినట్లు తెలిపారు. అయితే దీనికి కారణం వాతావరణంలో మార్పులు, చంద్రుడి ప్రభావం, సముద్రాల అలలే అని వారు తెలిపారు.

Similar News