Dating trends : ఆ ఐదు చాలా ముఖ్యం.. డేటింగ్ కల్చర్‌పై యువతలో పెరుగుతున్న ఇంట్రెస్ట్

రిలేషన్‌షిప్‌లోకి అడుగు పెట్టడమే కాదు, తమ బంధం బలంగా, రొమాంటిక్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు.

Update: 2024-08-02 09:17 GMT

దిశ, ఫీచర్స్ : రిలేషన్‌షిప్‌లోకి అడుగు పెట్టడమే కాదు, తమ బంధం బలంగా, రొమాంటిక్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం పార్ట్‌నర్ చేసే చిన్న చిన్న పనులను కూడా గమనించడం, అభినందించడం, పరస్పరం సహకరించుకోవడం వంటివి ఇక్కడ ప్రయారిటీ అంశాలుగా ఉంటాయని, డేటింగ్ కల్చర్‌లో దీనినే ‘గ్రీన్ ఫ్లాగ్స్’ అంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అవేమిటో చూద్దాం.

ఆత్మ విశ్వాసం

బంధం బలంగా ఉంటూ.. రొమాంటిక్ రిలేషన్‌షిప్ సవ్యంగా కొనసాగాలంటే.. పార్ట్‌నర్‌లో ఆత్మ విశ్వాసం కూడా నిండుగా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటోంది. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్నవాళ్లు తమను ఎవరైనా తమను జడ్జ్ చేస్తారేమోనని అస్సలు భయపడరని నిపుణులు చెప్తున్నారు. పైగా తమ ఫీలింగ్స్‌ను స్వేచ్ఛగా బయట పెడతారు. అదీగాక ఆత్మ విశ్వాసం కలిగిన పార్ట్‌నర్ వల్ల తాము సురక్షితంగా ఉంటామని చాలామంది భావిస్తారట. అందుకే ఈ జనరేషన్ వాళ్లు తమ భాగస్వామిలో సెల్ప్ కాన్ఫిడెంట్ ఉండాలని కోరుకుంటున్నారు.

ఫీలింగ్స్ క్యాచ్ చేయడం

ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కానీ ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించడం, ఫీలింగ్స్ క్యాచ్ చేయడం వంటివి తమ పార్ట్‌నర్‌లో ఉండాలని ఈరోజుల్లో చాలామంది కోరుకుంటున్నారు. చెప్పేది విని అర్థం చేసుకోవడం, అవతలి నుంచి కూడా అదే విధమైన శ్రద్ధ కనబర్చడం వంటి ప్రవర్తన బంధాన్ని బలోపేతం చేస్తుందని ఈతరం భావిస్తున్నట్లు రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు.

గుడ్ కమ్యూనికేషన్

రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకానీ ఒకరి గురించి ఏమీ తెలియకుండా, పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తిని తమ ఆసక్తులకు అనుగుణంగా జడ్జ్ చేయడం ఎవరికీ నచ్చదు. ఇది అర్థం చేసుకోవడంతోపాటు పార్ట్ నర్‌తో ప్రేమగా, గౌరవంగా మాట్లాడటం, భావాలను నిజాయితీగా చెప్పడం, అభిప్రాయ భేదాలు తలెత్తితే కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవడం వంటివిన్నీ రిలేషన్ షిప్‌లో గుడ్ కమ్యూనికేషన్ కిందికి వస్తాయి. ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

ఒత్తిడి నుంచి ఉపశమనం వరకు

మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మాటలు, ప్రవర్తన దానినుంచి బయటపడేసేలా ఉండాలి. కానీ మరింత ఒత్తిడికి గురిచేసేలా ఉండకూడదు. రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ముఖ్యమని నేటి యువత భావిస్తోంది. తాము ఎంపిక చేసుకోబోయే భాగస్వామిలో కూడా ఆ లక్షణాలు ఉండాలని కోరుకుంటోందని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తిగత సమస్య అయినప్పటికీ పార్ట్‌నర్ పట్టించుకోగలగాలి. మనసు తెలుసుకొని మసలు కోవాలి. సలహాలు సూచనలు ఇవ్వడం, కలిసి పరిష్కారం వెతకడం వంటివి చేయాలి. ఇది స్ట్రాంగ్ రిలేషన్ షిప్‌కి ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు.

బాధల్లో, భావోద్వేగాల్లో సపోర్ట్‌గా..

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు, నష్టాలు, బాధలు, భావోద్వేగాలు వస్తుంటాయి. అలాగని అవి శాశ్వతం కాదు. సంతోషాలు, సరదాలు వంటి అంశాల్లో భాగస్వామికి ఎలా సపోర్టుగా ఉంటారో, బాధలో ఉన్నప్పుడు, భావోద్వేగాలకు లోనైనప్పుడు కూడా అలాగే ఉండాలని నేటి యువత కోరుకుంటున్నట్లు రిలేషన్‌షిప్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు చెప్తున్నారు. పైన పేర్కొన్న ఐదు లక్షణాలు కలిగిన వ్యక్తిని పార్ట్‌నర్ పొందాలనే ఆసక్తిని నేటి డేటింగ్ కల్చర్‌లో ముఖ్యమైన ‘గ్రీన్ ఫ్లాగ్స్’గా పేర్కొంటున్నారు.


Similar News