సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక: ఈ యాప్స్ వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి!
ఆన్‌లైన్ యూజర్లకు హెచ్చరిక. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ యూజర్లకు హెచ్చరిక. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా మినీ గేమ్స్ ద్వారా డెలీ రివార్డులు అంటూ ఆశ చూపుతూ యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి గేమ్స్ యాప్స్ డౌన్‌లోడ్ చేసినప్పుడే వారి డివైజ్‌ల్లోని వ్యక్తిగత సమాచారం మొత్తం వెళ్లిపోతుంది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 100కు పైగా యాప్స్‌లో ఓ కొత్త మాల్‌వేర్ ఉన్నట్లు తాజాగా ‘స్పినోక్’ అనే మాల్‌వేర్‌ను సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు గుర్తించారు. వెంటనే ఈ మాల్‌వేర్ సోకిన యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి ఆన్‌ఇన్‌స్టాల్ చేయాలని తెలిపారు.
‘‘స్పిన్‌ఓకే’’ మాల్‌వేర్ సోకిన యాప్స్ దాదాపు 40 కోట్ల వరకు గూగుల్ ప్లేస్లోర్ నుంచి డౌన్‌లోడ్ అయినట్లు డా. వెబ్ నిపుణులు వెల్లడించారు. ఇది ఒక స్పైవేర్‌గా పనిచేస్తోందని, ఈ మాల్‌వేర్ ఒక ప్రకటన ఎస్‌డీకే ద్వారా మిగా యాప్స్‌లోకి ప్రవేశిస్తుందట. VFly, MVbit, Crazy drop, Biugo, Cashzine, Fizzo Novel, CashEM, Tick.. అనే ఒక్కో యాప్‌ను 50 లక్షల నుంచి కోటి మంది దాకా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కాగా యూజర్లు వెంటనే వీటిని డిలీట్ చేయాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
120W చార్జింగ్ సపోర్ట్‌తో iQoo కొత్త స్మార్ట్ ఫోన్
ల్యాప్‌టాప్‌ను అక్కడ పెట్టుకొని వాడితే స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు !