సమాధిపై 'శాపగ్రస్త' హెచ్చరిక.. ఎవరైనా తెరిస్తే అంతే!
దిశ, ఫీచర్స్ : ప్రాచీన చరిత్ర అనేక నిగూఢ రహస్యాలకు వేదిక. అయితే అలాంటి ఎన్నో అంతుచిక్కని సీక్రెట్స్ ఛేదించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రాచీన చరిత్ర అనేక నిగూఢ రహస్యాలకు వేదిక. అయితే అలాంటి ఎన్నో అంతుచిక్కని సీక్రెట్స్ ఛేదించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చారిత్రక వస్తువులు, ప్రాంతాలను వెలికితీయగా.. తాజాగా భయంకరమైన 'శాపగ్రస్త సమాధిని' కనుగొన్నారు.
ఇజ్రాయెల్, బీట్ షీయారిమ్‌లోని పురాతన శ్మశానవాటికలో ఇటీవలే ఓ 'శాపగ్రస్త సమాధి' బయటపడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో 65 ఏళ్ల కాలంలో కనుగొనబడిన మొదటి సమాధి ఇదే కావడం విశేషం. కాగా ఈ సమాధిపై 'ఎవరైనా దీన్ని తెరిస్తే శపిస్తానని యాకోవ్ హాగెర్ ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి దీనిని ఎవరూ తెరవవద్దు' అని' ఎరుపు రంగు అక్షరాలతో హెచ్చరిక రాసిఉంది. ఇక్కడ 'యాకోవ్ హాగెర్' అనేది యాకోబ్ మతమార్పిడిని అంటే జుడాయిజంలోకి మారడాన్ని సూచిస్తుంది.
అయితే, ఈ హెచ్చరికపై హైఫా యూనిర్సిటీ పురావస్తు శాస్త్రవేత్త ఎర్లిచ్ వివరణ ఇచ్చారు. మరణించిన వ్యక్తుల సమాధిని తెరిచేందుకు సాహసించేవారిని భయపెట్టేందుకే ఈ సందేశం రాయబడిందని పేర్కొన్నారు. ఈ శిలాశాసనం చివరి రోమన్ లేదా బైజాంటైన్ ప్రారంభ కాలం(క్రైస్తవ మతం బలపడిన కాలం) నాటిదని కూడా తెలియజేశారు. ఇక రోమన్ కాలంలో ఎక్కువగా అంత్యక్రియల సందర్భంగా మతం మారినవారి గురించి తెలుసన్న ప్రొఫెసర్.. ఇది బీట్ షీయారిమ్ నుంచి వచ్చిన మొదటి మతమార్పిడిగా తెలిపారు. కాగా ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ ఈ శాప శాసనాన్ని స్వాధీనం చేసుకుంది.