దగ్గును తరిమేద్దామిలా.. ఇంటివైద్యంతో తగ్గించుకోవచ్చు అంటున్న నిపుణులు

పిల్లలకైనా, పెద్దలకైనా దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Update: 2022-12-23 11:43 GMT

దిశ, ఫీచర్స్: పిల్లలకైనా, పెద్దలకైనా దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చలికాలంలో అయితే ఇది మరింత బాధపెడుతుంది. దీనివల్ల వ్యక్తిగతంగాను, వృత్తి పరంగాను కొన్ని అవస్థలు పడాల్సి వస్తుంది. అదే పనిగా దగ్గుతూ ఉంటే..ఎదుటివారు అనుమానంగా చూస్తుంటారు. అసలే కరోనా కాలం అని చుట్టు పక్కల ఉండేవారు దూరంగా జరుగుతుంటారు. అందుకే మన చేతిలో ఉన్నంతవరకు దగ్గు రాకుండా చూసుకోవడం, వచ్చినా ప్రారంభంలోనే తగ్గించుకోవడం చేయాలి. దగ్గును తగ్గించుకోవాలంటే.. అది ఏ కారణంవల్ల వచ్చిందో తెలుసుకోవాలి.

మానవ శరీరంలో కీలకమైన ఊపిరి తిత్తుల్లో సూక్ష్మక్రిములు ఎంటరైతేనో, ఇన్ ఫెక్షన్ సోకితేనో దగ్గు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకడంవల్ల సూక్ష్మ క్రిములు గొంతులోపలికి ప్రవేశించి కణజాలాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. అందుకే దగ్గను తరిమేందుకు మన బాడీలోని మంచి బ్యాక్టీరియా పోరాడుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకు వచ్చిన దగ్గు తాలూకు వైరస్ రోగనిరోధక బ్యాక్టీరియాకంటే బలమైనది అయినప్పుడు, అది పైచేయి సాధించినప్పుడు దగ్గు తగ్గదు. క్రమంగా జలుబు, జ్వరం కూడా వస్తాయి.

వారం వరకు కూడా దగ్గు తగ్గకపోతే తక్కువ అంచనా వేయవద్దు అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే అది టీబీ వ్యాధి కూడా కావచ్చు. దగ్గు తగ్గకపోయినా డాక్టర్‌ను సంప్రదించకుండా మెడికల్ షాపులో లభించే టాబ్లెట్స్ వాడుతుంటారు కొందరు. కానీ వారానికంటే ఎక్కువరోజులు దగ్గు సమస్యతో బాధపడుతున్నవారు ఇలా చేస్తే సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. అది క్రమంగా క్షయ వ్యాధికి దారి తీయవచ్చు. అందుకే డాక్టర్ ను సంప్రదించి అది ఏ రకమైన దగ్గు అనేది తెలుసుకొని మందులు వాడాలి. ఆధునిక వైద్యంతోపాటు రెండుమూడు రోజులు మాత్రమే ఉండే దగ్గును ఆయుర్వేదిక్ లేదా ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటిస్తే తరమికొట్టవచ్చు అని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు.

ఈ చిట్కాలు పాటిస్తే సరి

ఆవిరి పట్టడం: దగ్గు, జలుబు చేస్తే మన ఇండ్లల్లో పెద్దలు ఇలాంటి చిట్కానే పాటిస్తుంటారు. ఓ గిన్నెలో వేడి నీరు పోసి. అందులో కొంచెం పసుపు వేసి, దుప్పటి కప్పుకొని ఆ నీటి ఆవిరిని పీల్చాలి. దీనివల్ల మ్యూకస్‌ని చెడు పదార్థాలు అడ్డు తొలగి శ్వాస చక్కగా ఆడుతుందట. అంతేకాదు ఆవిరి పట్టడం అనేది యాంటీ సెప్టిక్‌లా పనిచేసి గొంతులో, ముక్కులో బ్యాక్టీరియా, క్రిములను చంపేస్తుంది.

వేడి నీరు, తేనెతో : తేనె ఆహార నాళం, శ్వాసకు మేలు చేస్తుందని నిపుణులు, పెద్దలు చెప్తుంటారు. ఊపిరి తిత్తులకు కావాల్సిన మాయిశ్చర్ దీనివల్ల లభిస్తుందట. అందుకే గోరు వెచ్చటి నీటిలో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగితే దగ్గు పారిపోతుంది.

నిమ్మ రసం: విటమిన్ C నిమ్మకాయల్లో అధికంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి కాయల్లోనూ సి విటమిన్ ఉంటుంది. విటమిన్ C టాబ్లెట్లు వాడే బదులు, సహజ సిద్ధమైన పండ్లను వాడటం మంచిది అంటున్నారు వైద్యులు. నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే గొంతులో నొప్పి, గరగర సమస్య చిటికెలో పోతుందట.

ఫుడ్ తీసుకునే విధానం : దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు. శరీరానికి పడని ఆహారాలు తింటే సమస్య జఠిలమవుతుంది. అందుకే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొంతమంది ఎప్పుడూ ఫ్రై చేసిన ఆహారం, స్పైసీ ఫుడ్ తినాలనుకుంటారు. దగ్గు సమస్య ఉంటే మాత్రం అవాయిడ్ చేయాల్సిందే. ఫ్యాట్ ఉండే ఫుడ్ కూడా తినకూడదు. నాన్ వెజ్‌కి దూరంగా ఉంటే మంచిది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఉడకబెట్టిన గుడ్లు, క్లియర్ సూప్స్ వంటివి దగ్గును తగ్గించడంలో తోడ్పడతాయి.

READ MORE

స్టయిలిష్ హెయిర్.. అందమైన జుట్టుకోసం జ్యూస్ ! 

Tags:    

Similar News