ఇంటర్వ్యూల్లో మొహాన్ని కవర్ చేయాల్సిందే.. సరికొత్త రూల్
సాధారణంగా ఇంటర్వ్యూ అంటే ఉదయాన్నే లేచి, రిక్రూటర్‌ను ఇంప్రెస్ చేసేలా రెడీ అవుతుంటారు.
దిశ, ఫీచర్స్: సాధారణంగా ఇంటర్వ్యూ అంటే ఉదయాన్నే లేచి, రిక్రూటర్‌ను ఇంప్రెస్ చేసేలా రెడీ అవుతుంటారు. స్కిల్స్‌తో కాకపోయినా కనీసం గుడ్ లుక్స్‌తో జాబ్ కొట్టేయాలనే ఆశతో సిద్ధమవుతారు. అయితే రూపంతో కాకుండా ప్రతిభను బట్టి ఎంప్లాయిస్‌ను రిక్రూట్ చేసుకోవాలనుకున్న చైనాకు చెందిన కంపెనీ.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో పాటు అటెండ్ అవుతున్న వారిని మాస్క్ ధరించాలని సూచించింది. తద్వారా వివక్షకు తావు ఉండదనేది సదరు కంపెనీ ఉద్దేశం.
చెంగ్డుకు చెందిన ఓ లాజిస్టిక్స్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోగా.. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ షార్ట్ క్లిప్‌లో కొందరు మాస్క్ పెట్టుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేందుకు బయట వెయిట్ చేస్తుండగా.. లోపల రిక్రూటర్ కూడా మాస్క్‌తో ప్రత్యక్షమయ్యాడు. అయితే ఉద్యోగ అభ్యర్థుల ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, రూపాన్ని బట్టి వ్యక్తుల వ్యక్తిగత సామర్థ్యాలకు విలువనిచ్చే వాస్తవాన్ని నొక్కి చెప్పడానికి విచిత్రమైన రిక్రూట్‌మెంట్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపింది కంపెనీ. కాగా, దీనిపై కామెంట్ చేస్తున్న నెటిజన్స్.. 'సోషల్ ఫోబియా ఉన్న వ్యక్తిగా, నేను ఇలాంటి జాబ్ ఇంటర్వ్యూని నిజంగా ఆనందిస్తాను' అని కొందరు అంటే.. 'ఇదీ సమానత్వం, మంచి రూపాన్ని ఎప్పుడూ పరిగణలోకి తీసుకోకూడదు' అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.