సొసైటీలో గౌరవాన్ని పెంచే కామన్ బిహేవియర్స్.. ఫాలో అయితేనే మంచీ.. మర్యాద!
సొసైటీలో, మనం నివసిస్తున్న ఇంటిలో, పనిచేస్తున్న ఆఫీసులో.. ప్రయాణిస్తున్న వాహనంలో.. ఇలా ఎక్కడైనా కావచ్చు. నలుగురూ గౌరవించాలంటే.. అందుకు తగిన ప్రవర్తన, గౌరవం, మర్యాద వంటివి మనలో కూడా ఉండాలంటున్నారు నిపుణులు.
దిశ, ఫీచర్స్ : సొసైటీలో, మనం నివసిస్తున్న ఇంటిలో, పనిచేస్తున్న ఆఫీసులో.. ప్రయాణిస్తున్న వాహనంలో.. ఇలా ఎక్కడైనా కావచ్చు. నలుగురూ గౌరవించాలంటే.. అందుకు తగిన ప్రవర్తన, గౌరవం, మర్యాద వంటివి మనలో కూడా ఉండాలంటున్నారు నిపుణులు. ఇక్కడ మర్యాద అంటే ఇంటికి వచ్చిన అతిథికి ఏం వంటకాలు చేసిపెట్టడం వంటిది మాత్రం కాదు. సమాజంలో మనవల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా చూడటమే అసలు ఉద్దేశం. అయితే ఈ గౌరవ, మర్యాదలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. కాలానుగుణంగా మారుతుంటాయి కూడా. ప్రస్తుతం సమాజంలో మన గౌరవాన్ని నిలబెట్టే మర్యాదలేవో తెలుసుకుందాం.
వెయిటర్ మీద అరవడం
సాధారణంగా మనం అప్పుడప్పుడైనా ఏదో ఒక రెస్టారెంట్‌కు వెళ్తుంటాం. అక్కడ కొందరు వెయిటర్‌తో దురుసుగా మాట్లాడటం, చులకన చేయడం, అరవడం వంటివి మీరు గమనించే ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. అగౌరవానికి, అమర్యాదకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. పైగా ఇలా వెయిటర్‌పై అరిచేవారిని అహంకారి అనుకుంటారు తప్ప ఎవరూ గౌరవించరు. సమాజంలో ఇది మంచి ప్రవర్తన కూడా కాదు. కాబట్టి ఈ మిస్టేక్ ఎప్పటికీ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఇతరులకు సీటు ఇవ్వండి
మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండి, బస్సులో, ట్రైన్‌లో లేదా ఇతర వాహనంలో జర్నీ చేస్తు్న్నారనుకోండి. మీరు సీట్లో కూర్చొని ఉంటారు. కానీ అక్కడ ఆరోగ్యం సరిగ్గా లేని మరో వ్యక్తి లేదా గర్భిణి సీటు దొరకక నిలబడి ఉంటే ఏం చేస్తారు?. కొందరు చూసీ చూడనట్లు వ్యవహరింస్తుంటారు. కానీ మీరు మాత్రం అలా చేయకండి. ఇది మర్యాదు కాదు. గౌరవంగా ఉండాలంటే గర్భిణులు, పెద్దలు, అనారోగ్యంతో ఉన్నవారికి సీటు ఇవ్వండి. దీనివల్ల మీకు ఆత్మ సంతృప్తి కలగడమే కాదు, సొసైటీలో మీ గౌరవాన్ని పెంచుతుంది.
మీకు తోచినట్లు అంచనా వేయకండి
కొందరు ఇతరుల జెండర్, సెక్సువాలిటీ లేదా రిలేషన్‌షిప్ స్టేటస్‌ను తప్పుగా భావించడమో, ఊహించడమో వంటి పొరపాట్లు చేస్తుంటారు. కానీ ఇది సొసైటీలో మీ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ముందుగా అవతలి వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకేంటేనే ఏదైనా ఒక విషయంలో అంచనాకు రావాలి తప్ప ఏదో ఒకటి అనేసుకొని అవతలి వారిని మీ ఆలోచనల పరిధిలో అంచనా వేస్తే అది తప్పుడు మర్యాద కిందకు వస్తుంది.
నలుగురితోపాటు నడవండి
కొందరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు, షాపింగ్ మాల్స్‌లో, సినిమా థియేటర్లలో మెట్లపై లేదా హాల్లో వెళ్తున్నప్పుడు అందరూ నడిచే దారిలో కాకుండా, మరో దారిలో వెళ్తుంటారు. కొన్నిసార్లు నలుగురైదుగురు కలిసి వెళ్లినప్పుడు కూడా ఇతరులకు దారి ఇవ్వకుండా నడుస్తుంటారు. ఇది అవతలి వ్యక్తులకు చిరాకు పుట్టిస్తుంది. పైగా ఇలా చేసినవారిని సభ్యత తెలియని వ్యక్తులుగా అంచనా వేస్తారు. కాబట్టి కొన్నిచోట్ల నలుగురితోపాటు నడవడమే మర్యాద.
ప్లీజ్.. థాంక్యూ.. వంటివి చెప్పండి
మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం, మీకు హెల్ప్ అవసరం అయినప్పుడు ప్లీజ్ అనే పదం ఉపయోగించడం మీపట్ల అవతలి వ్యక్తుల్లో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని మర్యాదస్తులుగా భావిస్తారు. అలాగే ఇతరులను మెచ్చుకోవడం, కృతజ్ఞతా పూర్వకంగా ఉండటం కూడా ఈ కోవకే చెందుతాయి. సొసైటీలో మీ గౌరవాన్ని పెంచుతాయి.
అడగకుండానే గెస్టును తీసుకెళ్లడం
మీరు బంధువుల ఇంటికో, ఫంక్షన్‌కో, మరో కార్యక్రమానికి వెళ్తుంటారు. వారు కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆహ్వానించి ఉంటారు. కానీ మీరు అవతలి వ్యక్తి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా మీ స్నేహితులనో, పెంపుడు జంతువులనో లేదా ఇటీవల మీరు డేటింగ్ ప్రారంభించిన వ్యక్తినో.. ఇలా ఎవరినైనా తీసుకెళ్లారనుకోండి. అవతలి వ్యక్తులు మిమ్మల్ని గౌరవ, మర్యాదలు తెలియని వారిగా భావిస్తారు. మరో సందర్భంలో మిమ్మల్ని పిలువరు. మీతో కాంటాక్ట్ తగ్గించుకోవాలని చూస్తారు. మీరు గెస్టుగా వెళ్తున్నప్పుడు మీతో పాటు ఇతరులు కూడా ఆటోమేటికల్లీ ఇన్వైటెడ్ అని మాత్రం ఎన్నడూ అనుకోకండి.
టైమ్ పాటించడం
క్లైంట్‌ను కలవడం, ఆఫీసుకు వెళ్లడం, మీటింగ్‌లకు లేదా మీరు మాట ఇచ్చిన వ్యక్తిని కలవడానికి అనుకున్న ప్రదేశానికి వెళ్లడం వంటి విషయాల్లో ఎప్పుడో ఒకసారి ఆలస్యం జరిగితే పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నిరంతరం అదే కొనసాగితే మాత్రం మీరు మర్యాదస్తులు కాదనే విషయం అర్థమైపోతుంది. మీపట్ల గౌరవం తగ్గుతుంది. ఇతరుల దృష్టిలో చులకనై పోతారు. కాబట్టి టైమ్ టేబుల్ తప్పక ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, సొసైటీలో అనుసరించాల్సిన మర్యాద నియమాలు ఇంకా చాలా ఉన్నాయి. తెలిసి మసలు కోవడమే విజ్ఞతకు నిదర్శనమని నిపుణులు సూచిస్తున్నారు.
రిప్లయ్ ఇవ్వకపోవడం, కూర్చునే విధానం
ప్రాపర్ మర్యాదలు.. మీరు ప్రతీ మెసేజ్ లేదా ప్రతీ ప్రశ్నకు వెంటనే ఆన్సర్ ఇవ్వాలని నిర్దేశించవు. కానీ అది ముఖ్యమైనది అయినప్పుడు స్పందించడం కనీస మర్యాద. అవతలి వ్యక్తికి ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి. కానీ ఏదీ చెప్పకుండా నాన్చడం మీపట్ల గౌరవాన్ని తగ్గిస్తుంది. మీరు మర్యాదస్తులు కాదని అవతలి వారు భావిస్తారు. అలాగే కొందరు బస్సులో వెళ్తు్న్నప్పుడో, బయట పార్కులో, మరో చోటనో కూర్చున్నప్పుడు కాళ్లను చాపుకొని కూర్చోవడం, ఇతరులకు స్పేస్ లేకుండా చేయడం వంటివి చేస్తుంటారు. ఈ ప్రవర్తన అవతలి వ్యక్తులకు అసహ్యం కలిగిస్తుంది. గౌరవ మర్యాదలు తెలియని వ్యక్తిగా మిమ్మల్ని భావిస్తారు.
ఎక్కడి నుంచి వచ్చారంటూ..
మీ ఇంటికి లేదా మీరున్న మరో చోటకు తెలిసిన వ్యక్తి వచ్చారనుకోండి. ఎప్పుడొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అని ఒకసారి అడిగితే ఒకే. కానీ పదే పదే అడగడం, పైగా నిజంగా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? వంటి ప్రశ్నలు వేయడం మర్యాద అనిపించుకోదు. అవతలి వ్యక్తి దృష్టిలో మీరు చులకనై పోతారు. అలాగే వారి కులం, మతం, వంటివి అడగడం కూడా మీరు గౌరవం తెలియని వ్యక్తులుగా అవతలి వారు భావించేందుకు కారణం అవుతాయి.