పొత్తి కడుపులో నొప్పి నిరంతరం వేధిస్తోందా?.. పెద్దప్రేగు క్యాన్సర్ కావచ్చు

నిరంతరం పొత్తికడుపులో నొప్పిగా ఉంటోందా? తిమ్మిరి, అసౌకర్యంగా అనిపిస్తున్నాయా? అయితే వీటిని పెద్దప్రేగు క్యాన్సర్‌గా లక్షణాలుగా అనుమానించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

Update: 2023-03-19 12:24 GMT

దిశ,ఫీచర్స్: నిరంతరం పొత్తికడుపులో నొప్పిగా ఉంటోందా? తిమ్మిరి, అసౌకర్యంగా అనిపిస్తున్నాయా? అయితే వీటిని పెద్దప్రేగు క్యాన్సర్‌గా లక్షణాలుగా అనుమానించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో పెద్దప్రేగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే 90 శాతం నయం అయ్యే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి.



తరచూ మలబద్ధకం లేదా మలం రంగులో మార్పు, నిరంతరం పొత్తికడుపు నొప్పి, తిమ్మిరి లేదా అసౌకర్యంగా అనిపించడం పెద్దప్రేగు క్యాన్సర్‌ లక్షణాల్లో భాగమే. దీంతోపాటు ఎటువంటి ప్రయత్నాలు లేకుండానే కొద్దిరోజుల్లోనే అకస్మాత్తుగా బరువు తగ్గడం, అకారణంగా తీవ్రమైన అలసట లేదా బలహీనంగా అనిపించడం పెద్దప్రేగు క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పొచ్చు. ఈ క్యాన్సర్‌వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. అందుకే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్ మెంట్ తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా 90 శాతం నయం అయ్యే అవకాశం ఉంటుంది. చికిత్స తర్వాత దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 



Read more:

వాతావరణం చల్లబడితే చెవిలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Tags:    

Similar News