Coffee Benefits : కుదిరితే కప్ కాఫీ.. బెస్ట్ మూడ్ చేంజ్ టెక్నిక్ అదే!

Coffee Benefits : కుదిరితే కప్ కాఫీ.. బెస్ట్ మూడ్ చేంజ్ టెక్నిక్ అదే!

Update: 2024-10-01 12:00 GMT

దిశ, ఫీచర్స్ : ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్ కాఫీ’ ఈ డైలాగ్ ఎంత ఫేమసో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డైలాగ్ ఏమో కానీ.. కాఫీ మాత్రం నిజంగానే అద్భుతం చేస్తుంది అంటుంటారు పెద్దలు. మీరు ఒత్తిడిలో ఉన్నా, బాధలో ఉన్నా మూడ్ బాగోలేకపోయినా ఓ కప్పు కాఫీ లాగించేసేయండి. కాసేపటి తర్వాత మంచి అనుభూతిని పొందుతారని, చురుకుదనం పెరుగుతుందని నిపుణులు సైతం చెప్తుంటారు. అందుకు కారణం కాఫీలో ‘కెఫిన్’ కంటెంట్ ఉండటమే. కాబట్టి ఇది బెస్ట్ మూడ్ చేంజ్ టెక్నిక్‌గా పనిచేస్తుందని చెప్తారు. రోజూ రెండు లేదా మూడు కప్పుల వరకు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అంతకు మించితేనే రిస్క్ అంటున్నారు నిపుణులు. అయితే కాఫీ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

*పొద్దున్న లేవగానే ఆరుబయట కూర్చొని కాఫీ తాగనిదే కొందరికి పొద్దు గడవదు. పైగా ఇది వారిలో మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. తక్కువ స్థాయిలో కెఫిన్ తీసుకోవడం చురుకుదనాన్ని పెంచుతుంది.

*మీ మూడ్ బాగోలేకున్నా సరే ఓ కప్పు కాఫీ తాగేస్తే సెట్ అయిపోతారు. అందుకే కాఫీని మూడ్ ఆఫ్‌‌ను దూరం చేసే ఔషధంగా కొందరు పేర్కొంటారు. బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ అది ఏదైనా సరే మీ నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అయితే ఇదంతా లిమిట్‌గా తాగినప్పుడు మాత్రమే అని గుర్తుంచుకోండి.

*బ్లాక్ కాఫీ లేదా మిల్క్ కాఫీ రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని చెప్తారు. అయితే ఇందులో షుగర్‌కు బదులు తేనె కలపాలి. లేదంటే షుగర్ ఫ్రీ కాఫీనే ఆస్వాదించాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

* కాఫీలో కెఫిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డైలీ ఒకటి రెండు కప్పులు తాగడంవల్ల అది మెదడు కణాలను ఉత్తేజ పరుస్తుంది. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. కణాలను యాక్టివేట్ చేయడం ద్వారా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. ఎక్కువగా తాగితే మాత్రం తలనొప్పి రావచ్చు కూడా.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News