దిశ, వెబ్ డెస్క్: భారతీయులు శుభ సమయంలో ఎక్కువగా కొబ్బరికాయలను ఉపయోగిస్తుంటారు. అలాగే దేవాలయాలకు ఇంట్లో ఏదైనా పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ కచ్చితంగా కొడతారు. గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరి పీచును తీసి పడేస్తారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి పట్టణ ప్రాంతాల్లో పెద్దగా కష్టపడటం లేదు. అలాగే ఆన్‌లైన్‌లో అన్ని క్లీన్ చేసి వస్తున్నాయి. దీంతో చాలా మంది అన్నింటినీ ఆన్‌లైన్ బుక్ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా, కొబ్బరి పీచు ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. కానీ, ధర ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అరకీలో కొబ్బరిపీచు ధర ఏకంగా రూ. 350 లు ఉంది. ఈ లెక్కన చూస్తే కీలో కొబ్బరిపీచు రూ.700 లు. దీంతో అది చూసిన జనాలు ఒక్కసారిగా కంగుతింటున్నారు. ఆఖరకు కొబ్బరి పీచును కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చింది అంటున్నారు.
ఇవి కూడా చదవండి : Dreams: కలలో మీకు ఇది కనిపిస్తే.. రాత్రికి రాత్రే మీ జీవితం మొత్తం మారిపోతుందట!