ఇసుక మేఘాలు ఎప్పుడైనా చూశారా? ఇక్కడ గుర్తించిన శాస్త్రవేత్తలు..
ఆకాశంలోని నక్షత్రాలు, వివిధ గ్రహాలు(planets) రకరకాల ప్రత్యేకతలు కలిగి ఉంటాయి.
దిశ, ఫీచర్స్ : ఆకాశంలోని నక్షత్రాలు, వివిధ గ్రహాలు(planets) రకరకాల ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అయితే పరిశోధకులు తాజాగా కనుగొన్న ఒక గ్రహం(VHS 1256 b)లో ‘ఇసుక’తో పాటు దాని వాతావరణంలో నీరు, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రహం రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నట్లు, ‘ఇసుక మేఘాలు’ కలిగి ఉన్నట్లు చిత్రాలను క్యాప్చర్ చేసింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్.
కదులుతున్న ఇసుక మేఘాలు
యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన బ్రిటనీ మైల్స్(Brittany Miles) నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ మేఘాలను గుర్తించినట్లు నాసా తెలిపింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను(JWST) ఉపయోగించిన పరిశోధకులు నూతన గ్రహం(new planet) వాతావరణంలో ‘సిలికేట్ క్లౌడ్ లక్షణాలను’ (silicate cloud features) గుర్తించింది. ఈ కారణంతోనే ఆ ప్లానెట్‌కు ‘VHS 1256 b’ గా పేరు పెట్టింది. ఈ ఇసుక మేఘాలు నిరంతరం కదులుతూ, పెరుగుతూ, వాతావరణంలో కలిసిపోతూ ఉంటాయి. వాటిలోని వేడి పదార్థం పైకి నెట్టబడితే.. చల్లగా ఉన్న పదార్థం మాత్రం కిందికి నెట్టబడుతుంది.
40 కాంతి సంవత్సరాల దూరంలో
‘VHS 1256 b అనేది మన సూర్యుడి నుంచి ప్లూటో(Pluto) కంటే దాని నక్షత్రాల నుంచి నాలుగు రెట్లు (40 కాంతి సంవత్సరాలు) దూరంలో ఉంది. ఇది వెబ్‌స్పేస్ టెలిస్కోప్‌కు గొప్ప లక్ష్యంగా ఉంది(a great target for Webb)’ అని పరిశోధకుడు మైల్స్ చెప్పాడు. ‘అంటే.. ఈ గ్రహం నుంచి వెలువడే కాంతి, దాని నక్షత్రాల నుంచి వచ్చే కాంతితో మిళితం కాలేదు. సిలికేట్ మేఘాలు మండిపోతున్న క్రమంలో ఆ గ్రహం యొక్క వాతావరణంలో ఉష్ణోగ్రతలు 1,500 డిగ్రీల ఫారెన్‌హీట్ (830 డిగ్రీల సెల్సియస్)కి చేరుకుంటాయి. ఈ వాతావరణంలోని సూక్ష్మమైన సిలికేట్ గ్రెయిన్స్ (silicate grains) పొగలోని చిన్న కణాల మాదిరి ఉండవచ్చు. ఇక్కడి లార్జెస్ట్ గ్రెయిన్స్ నాసా వెబ్ టెలిస్కోప్‌లో చిన్న ఇసుక రేణువుల్లా కనిపించాయి’ అని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన మరో పరిశోధకుడు బెత్ బిల్లర్ పేర్కొన్నాడు.
Also Read..