Brain Tumor : ఐదు రోజుల్లో బ్రెయిన్ ట్యూమర్ మాయం
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కాగా 2020 రిపోర్ట్ ప్రకారం ఏటా పది మిలియన్ల మంది చనిపోతున్నారు. అంటే వ్యాధి సోకిన ఆరుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కాగా 2020 రిపోర్ట్ ప్రకారం ఏటా పది మిలియన్ల మంది చనిపోతున్నారు. అంటే వ్యాధి సోకిన ఆరుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. దీంతో క్యాన్సర్ ట్రీట్మెంట్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు సంచలనాత్మక CAR-T సెల్ థెరపీ డెవలప్ చేశారు. ఈ చికిత్స కొద్ది రోజుల్లోనే ప్రాణాంతకమైన గ్లియోబ్లాస్టోమా బ్రెయిన్ ట్యూమర్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించిందని తెలిపారు.
క్లినికల్ ట్రయల్‌లో 72 ఏళ్ల రోగి ట్యూమర్ 60% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. ఇక మరొక రోగి ఐదు రోజులలోనే పూర్తిగా నయమైపోయిందని తెలిపారు. కాగా ఈ చికిత్స క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి రోగి T-కణాలను రీ-ఇంజనీర్ చేస్తుంది. జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ మంచి ఫలితాలను అందిస్తుంది.