షుగర్ కంట్రోల్ చేస్తున్న దాల్చిన చెక్క

యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు కలిగిన దాల్చిన చెక్క బరువు తగ్గించేందుకు ఉబకాయ చికిత్సలో ఉపయోగపడింది. అయితే తాజా అధ్యయనాలు షుగర్ కంట్రోల్

Update: 2024-06-25 17:31 GMT

దిశ, ఫీచర్స్: యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు కలిగిన దాల్చిన చెక్క బరువు తగ్గించేందుకు ఉబకాయ చికిత్సలో ఉపయోగపడింది. అయితే తాజా అధ్యయనాలు షుగర్ కంట్రోల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని తేల్చాయి. ఇంతకీ ఎలా వినియోగించబడుతుంది? ఎన్ని విధాలుగా సహాయపడుతుంది? తెలుసుకుందాం.

* ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచవచ్చు

మధుమేహం కోసం దాల్చినచెక్కను ఉపయోగించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఇన్సులిన్ సెన్సిటివిటీ స్థాయిలను పెంచుతుంది. ఇది మీ శరీరంలోని ఇన్సులిన్‌ మెరుగ్గా పనిచేసేలా .. కణాలకు చక్కెరను పొందడంలో మరింత సమర్థవంతంగా చేస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ (MetS), ఇన్సులిన్ నిరోధకతకు దారితీసే పరిస్థితిని మేనేజ్ చేస్తుంది. మరణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైటోథెరపీ రీసెర్చ్‌లో ప్రచురించబడిన అధ్యయనం .. PCOS రోగులపై దాల్చిన చెక్క ప్రభావాన్ని అంచనా వేసింది. 1.5 గ్రా దాల్చినచెక్క రోజుకు రెండుసార్లు మూడు నెలల పాటు తీసుకుంటే.. ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని తేల్చింది.

* తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు

భోజనం చేశాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దాల్చిన చెక్క దీనిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. తినే ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుంది. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన మరో అధ్యయనం ప్రకారం., కేవలం పాయసం తినడంతో పోలిస్తే బియ్యంతో చేసిన పరమాన్నంలో ఆరు గ్రాముల దాల్చినచెక్కను చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

* డయాబెటిస్ వల్ల కలిగే సమస్యల తగ్గింపు

మధుమేహం కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం ఉండొచ్చు. జర్నల్ ఆఫ్ క్లినికల్ లిపిడాలజీలో ప్రచురించబడిన అధ్యయనం.. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ నిర్వహణలో సహాయపడుతుందని తెలిపింది. ఇది గుండె జబ్బులకు దారితీసే రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్, మొత్తం కొలెస్ట్రాల్ సాంద్రతలను తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. రోజుకు 2 గ్రాముల దాల్చిన చెక్క రెండు నెలల పాటు తీసుకుంటే సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటును తగ్గిస్తుందని వివరించింది.

* ఇతర ప్రయోజనాలు

దాల్చినచెక్క మధుమేహంతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనేక శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో వినియోగించబడుతుంది. ఆర్థరైటిస్‌తో పాటు తలనొప్పి నివారణకు కూడా సహాయపడుతుంది.

ఎలా వినియోగించాలి?

దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి. సింపుల్ గా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. లేదంటే పాలతో చేసిన టీ లేదా బ్లాక్ టికీ కలిపి తీసుకోవచ్చు. ఇంకా నీటికి దాల్చిన చెక్కను జోడించి మరిగించాక.. దాన్ని చల్లార్చి నిమ్మరసం, తేనె కలిపి తాగొచ్చు. అన్నం, కూరల్లో జోడించి కూడా ఎంజాయ్ చేయవచ్చు.


Similar News