Chinese beauty tips : చర్మ సౌందర్యాన్ని పెంచే చైనీస్ చిట్కాలు.. వాళ్లేం చేస్తారంటే..

Chinese beauty tips : చర్మ సౌందర్యాన్ని పెంచే చైనీస్ చిట్కాలు.. వాళ్లేం చేస్తారంటే..

Update: 2024-09-26 13:36 GMT

దిశ, ఫీచర్స్ : చైనీస్ ప్రజల్లో ఆరోగ్యం, అందంపట్ల ఆసక్తి, స్పృహ ఎక్కువే అంటున్నారు నిపుణులు. వీరు శారీరక సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అక్కడి వారిలో వయస్సు పరంగా 60 ఏండ్లు నిండినా, ఇంకా 20 ఏండ్ల ఏజ్ కలిగిన వారిలా ఫిట్‌గా కనిపించేవారు చాలా మందే ఉంటారు. అందుకు కారణం వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సంప్రదాయ పద్ధతులు కూడా కారణమేనట. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* వారంలో ఒక రోజు శాకాహారం : చైనాలో మాంసాహారం, శాకాహారం రెండూ తింటారు. అయినప్పటికీ వారానికి ఒకసారి పోషకాలు కలిగిన ప్రత్యేక శాఖాహారాన్ని తప్పక తీసుకోవడం అక్కడి ప్రజల సాధారణ అలవాటు. దీనిని చైనీస్ సంప్రదాయ ఔషధంగా నిపుణులు పేర్కొంటారు. అలాగే వారు ఎప్పటికప్పుడు తాజా పదార్థాలను తినడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, శారీరక శ్రమ లేదా వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఫిట్‌నెస్‌ను, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.

* ఉప్పు:  చైనీయులు అన్నంలో, కూరల్లో ఉప్పు ఎక్కువగా యూజ్ చేయరు. ఒక లిమిట్ వరకు మాత్రమే వాడతారు. అలాగే ఇతర దేశాల్లో ఉప్పు, కారం అధికంగా ఉండే స్పైసీ చైనీస్ ఫుడ్స్ చాలామంది ఇష్టపడతారు. కానీ చైనాలో మాత్రం అక్కడి ప్రజలు వీటిని తక్కువగా తింటారట. ఆహారాల్లో సోడియం తక్కువగా వాడటంవల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. చైనా ప్రజల చర్మసౌందర్యానికి ఇదీ ఒక కారణమే.

*లోటస్ లీఫ్ టీ : చైనా ప్రజల్లో అత్యధిక మంది తప్పకుండా తామరాకుతో తయారు చేసిన టీని తాగుతారు. ఇది బరువు తగ్గడంలో, మూత్ర పిండాల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వు పదార్థాలను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ రెండు నుంచి మూడు కప్పుల వరకు తామరాకు టీని తాగడం ఆరోగ్యానికి, నిగనిగలాడే చర్మ సౌందర్యానికి సహాయపడుతుంది.

* తాయ్ చి : ఇండియాలో యోగా మాదిరి చైనాలో సంప్రదాయ వ్యాయామ పద్ధతిని తాయ్ చి అంటారు. ఇక్కడ చాలామంది దీనిని ప్రాక్టీస్ చేస్తారు. ఒత్తిడి, ఆందోళ, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పర్చడం ద్వారా చర్మసౌందర్యానికి, ఆరోగ్యానికి కారణం అవుతుంది.

* మూంగ్ దాల్ : పెసర పప్పును చాలాచోట్ల వంటకాల్లో ఉపయోగిస్తారు. చైనాలో వంటకంతోపాటు చర్మ సంరక్షణలో పచ్చి పెసర కాయను, గింజలను ఉపయోగిస్తారు. అలాగే పప్పును నానబెట్టి, మెత్తగా గ్రైండ్ చేసి వివిధ పదార్థాలను కలిపి చర్మానికి అప్లై చేస్తుంటారు. ఈ సంప్రదాయ రెమిడీ వారి చర్మంలో యవ్వన ఛాయలను పెంచుతుందని చెప్తారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News