చంద్రుడి మట్టి నుంచి నీటి తయారీ... భవిష్యత్తు తరాలకు ఢోకా లేనట్లే..
చంద్రుడి ఉపరితలాన్ని మానవ ఆవాసంగా ఏర్పాటు చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయోగాలు జరుగుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : చంద్రుడి ఉపరితలాన్ని మానవ ఆవాసంగా ఏర్పాటు చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుని మట్టి నుంచి నీటిని తయారు చేయడంలో చైనా శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. ఎండోజెనస్ హైడ్రోజన్, లూనార్ రెగోలిత్ మధ్య ప్రత్యేకమైన రసాయన ప్రతిచర్యను ఉపయోగించి నీటిని సృష్టించారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS)కు సంబంధించిన నింగ్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (NIMTE)లో ప్రొఫెసర్ WANG జున్కియాంగ్ ఈ ప్రయోగానికి నాయకత్వం వహించారు.
చాంగ్ ఇ-5 మిషన్ ద్వారా తెచ్చిన లూనార్ రెగోలిత్ నమూనాలను చంద్రునిపై నీటిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు పరిశోధకులు. ప్రత్యేకంగా రూపొందించిన పుటాకార అద్దాలను ఉపయోగించి 1,200K కంటే ఎక్కువ వేడిచేసిన చంద్రుని రెగోలిత్ ఒక గ్రాము కరిగిన మూన్ రెగోలిత్‌ను రూపొందించడానికి దారితీసింది. ఇది దాదాపు 51 నుంచి 76 mg నీటిని ఉత్పత్తి చేయగలదు. అంటే ఒక టన్ను లూనార్ రెగోలిత్ 50 కిలోల కంటే ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలదు. ఇది వంద 500మి.లీ బాటిళ్ల తాగునీటికి సమానం. కాగా ఒక్కరోజుకి 50 మంది మానవులకు సరిపోయే నీటిని అందించగలవు.