ఇక ఒక్క సెకన్ ఆలస్యం కూడా లేదు.. 6Gతో రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్

6G.. , వేగవంతమైన కమ్యూనికేషన్‌‌ను ఏర్పరుస్తుందని తెలిపారు

Update: 2023-04-25 11:39 GMT

దిశ, ఫీచర్స్: 6G.. మరింత విశ్వసనీయమైన, వేగవంతమైన కమ్యూనికేషన్‌‌ను ఏర్పరుస్తుందని తెలిపారు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సెకండ్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు. తొలి రియల్ టైమ్ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్‌లో పురోగతి సాధించినట్లు చెప్పారు. ఇప్పటి వరకున్న కమ్యూనికేషన్‌లో కొద్దిపాటి జాప్యం మాత్రమే కలిగిన 5G నెట్‌వర్క్‌‌ను కూడా బీట్ చేయగలదని.. ఇందుకోసం టెరాహెర్ట్జ్ ఆర్బిటల్ యాంగ్యులర్ మొమెంటం కమ్యూనికేషన్‌ ఉపయోగిస్తున్నట్లు వివరించారు.

టెరాహెర్ట్జ్ అనేది విద్యుదయస్కాంత స్పెక్ట్రం యొక్క 100 GHz -10 THz ఫ్రీక్వెన్సీ పరిధిలో కమ్యూనికేషన్‌ను సూచిస్తుంది. ఈ సాంకేతికత అధిక ఫ్రీక్వెన్సీ పరిధి ఫాస్టర్ డేటా ట్రాన్స్‌ఫర్ రేట్స్, ఇన్ఫర్మేషన్‌ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్ సురక్షితమైన, అధిక-వేగంతో కూడి ఉంది కాబట్టి మిలిటరీ ఎన్విరాన్మెంట్‌లో ఉపయోగించేందుకు బెస్ట్‌గా పరిగణించబడుతోంది.

చైనా సాధించిన ప్రత్యేకత ఏమిటి?

6G సెల్యులార్ నెట్‌వర్క్‌లు హై-డెఫినిషన్ వర్చువల్ రియాలిటీ (VR), హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, డేటా-ఇంటెన్సివ్ అప్లికేషన్‌ల వంటి పవర్ అప్లికేషన్‌లను అందిస్తాయి. 110 GHz ఫ్రీక్వెన్సీ వద్ద నాలుగు వేర్వేరు బీమ్ నమూనాలను రూపొందించడానికి పరిశోధకులు ప్రత్యేక యాంటెన్నాను ఉపయోగించారు. అలా చేయడం వలన 10 GHz బ్యాండ్‌విడ్త్‌లో సెకనుకు 100 గిగాబిట్‌ల వేగంతో డేటాను ప్రసారం చేయగలరు. కాగా ఇది ప్రస్తుత లెవల్స్‌కు గణనీయమైన అప్‌గ్రేడ్‌.

Tags:    

Similar News