పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలంటే.. ఇలా చేయండి!!

‘ఎప్పుడు చూసినా ఆన్‌లైన్‌లోనే గడుపుతుంటారు. అంతసేపు ఏం చూస్తున్నావని అడిగితే మాత్రం అస్సలు చెప్పరు’.

Update: 2023-04-17 12:15 GMT

దిశ, ఫీచర్స్: ‘ఎప్పుడు చూసినా ఆన్‌లైన్‌లోనే గడుపుతుంటారు. అంతసేపు ఏం చూస్తున్నావని అడిగితే మాత్రం అస్సలు చెప్పరు’.. చాలామంది టీనేజర్స్ గురించి పేరెంట్స్ చెప్తున్న మాటలివి. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి మరింత పెరిగింది. ఇంటర్నెట్‌ వాడకం ఒక వ్యసనంగా మారింది. ఫోన్ చూడకపోతే విలువైన కంటెంట్, ఎంజాయ్‌మెంట్ మిస్ అవుతున్నామనే బాధ పెరిగిపోతోంది.

వేరొకరితో పోల్చినప్పుడు తాము పెట్టిన పోస్ట్‌లకు లైక్‌లు రావడం లేదని నిరాశతో అనారోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన తల్లిదండ్రులు పిల్లలు అనారోగ్యానికి గురవుతారేమోనని ఆందోళన చెందుతుంటారు. చూడకూడని వీడియోలు, చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను ఎక్కడ యాక్సెస్ చేస్తారోననే టెన్షన్‌లో తిడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు మాటవినకపోవడమో, విన్నట్లు నటించడమో చేస్తూ, ఆన్‌లైన్ లేదా సోషల్ మీడియా వేదికగా ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపుల గురించి పేరెంట్స్‌కు చెప్పకుండా ఉంటున్నారని తాజా అధ్యయనం తెలిపింది.

తరచూ ఆన్‌లైన్‌లో ఉండటం, ఇంటర్నెట్ వాడకం యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన కచ్చితనమైన ఆధారాలు మాత్రం చాలా తక్కువగా (30 శాతం) ఉంటున్నాయి. పైగా సోషల్ మీడియా పిల్లలకు మేలు చేస్తుందని, వారిలో నాలెడ్జ్ ఇంప్రూవ్ మెంట్‌కు, సోషల్ కనెక్టివిటీకి దోహదం చేస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే వాస్తవం తెలుసుకునేందుకు పలువురు నిపుణులు 1000 మంది యువకులను ప్రశ్నించడం, పరిశీలించడం ద్వారా పలు ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోగలిగారు.

ఆన్‌లైన్‌లో బిజీ అయిపోవడం, అక్కడ ఎదుర్కొనే ఇబ్బందులను పిల్లలు తమ పేరెంట్స్ లేదా కుటుంబంలోని పెద్దలతో పంచుకోకపోవడానికి ప్రధాన కారణం సరైన కమ్యూనికేషన్ ప్రాసెస్ లేకపోవడమేనని తెలిపారు. ఫోన్ వాడకంతో ఎదురయ్యే సమస్యలు, ప్రయోజనాల గురించి పెద్దలు పిల్లలకు ఫ్రెండ్లీగా వివరించడంలో విఫలం అవుతున్నారని వివరించారు. ‘‘ఇంటర్నెట్ వాడొద్దు, ఫోన్ చూడొద్దు. చూడటం బాగోదు. చెప్పినట్లు వినాలి’’ అంటూ వార్నింగ్ ఇస్తున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు తప్ప లాభ నష్టాల గురించి చెప్పడం లేదు. పైగా ‘ఆన్‌లైన్’ అంటే.. పేరెంట్స్ కోప్పడతారనే ఉద్దేశంతో అందులో తాము ఎదుర్కొనే వేధింపులు, బెదిరింపుల గురించి టీనేజర్స్ తమ పేరెంట్స్ వద్ద చెప్పడం లేదని స్టడీలో పాల్గొన్న వినీత్ గుప్త పేర్కొన్నారు.

Also Read..

ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతున్నారా?.. హెయిర్ లాస్ ప్రాబ్లం రావచ్చు 

Tags:    

Similar News