CHICKEN EFFECTS IN RAINY SEASON: బిగ్ అలర్ట్.. వర్షాకాలంలో అతిగా చికెన్ తింటున్నారా?
వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. పల్లె, పట్టణాలతో సంబంధం లేకుండా ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే.
దిశ, ఫీచర్స్: వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. పల్లె, పట్టణాలతో సంబంధం లేకుండా ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కొంతమందైతే కేవలం ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు చికెన్ తింటుంటారు. అయితే ఇటీవల రోజుల్లో కోళ్లు తొందరగా ఎదగడానికి దాణాతో పాటు పలు రకాల యాంటీబయాటిక్ మందులు కూడా ఇస్తుంటారని.. అందువల్ల మనిషి పూర్తిగా వీక్ అయ్యే చాన్సెన్ ఉన్నాయని వైద్యుడు అరిందమ్ బిస్వాస్ చెబుతున్నారు. ఈ రకమైన చికెన్‌ను తిన్నట్లైతే.. శరీరంలోని ఇమ్యూనిటి పవర్ క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. కోళ్లకు ఇచ్చే యాంటీబయాటిక్స్ కారణంగా మన బాడీలోని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో పూర్తిగా విఫలమవుతాయని అన్నారు.
మార్కెట్‌లో విక్రయించే ప్రాసెస్ చేసిన చికెన్ లో కొలిస్టిన్ ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు లండన్‌లోని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రీసెంట్‌గా చేసిన సర్వేలో తేలిందని అరిందమ్ బిస్వాస్ వెల్లడించారు. ఇండియాలో పౌల్ట్రీ ఫామ్‌లలో కొలిస్టిన్‌ను ఎక్కువగా వాడడం ఆపాలని..దీనిపై హెల్త్ కు సంబంధించిన అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. చికెన్ వీలైనంత తక్కువగా తినాలని సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కోళ్లలో పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు ఫారాల చుట్టూ పెరిగే తేమ కారణంగా కోళ్లలో న్యూమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర వంటి రోగాలు వచ్చి కోళ్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా చికెన్ ప్రియులు వర్షాకాలంలో చికెన్ తక్కువగా తినడం మంచిదని చెబుతున్నారు.