చెస్ ఆటలో సెక్స్ టాయ్ క్లూ ఇస్తుందా..? నగ్నంగా ఆడేందుకు సై అంటున్న ప్లేయర్
చెస్ జీనియస్ హన్ నీమాన్ సింక్యూఫీల్డ్ టోర్నమెంట్ కప్‌లో మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దిశ, ఫీచర్స్: చెస్ జీనియస్ హన్ నీమాన్ సింక్యూఫీల్డ్ టోర్నమెంట్ కప్‌లో మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైనల్స్ ఆడే క్రమంలో తనను మెరుగుపరుచుకోవడానికి సెక్స్ టాయ్‌ను ఉపయోగించి దాదాపు రూ. 3కోట్లు విలువైన బహుమతిని కొల్లగొట్టాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలోన్ మస్క్ కూడా కాన్సంట్రేట్ చేయడంతో టాపిక్ వైరల్ అయింది.అత్యల్ప రేటింగ్ కలిగిన 19ఏళ్ల హన్స్ నీమాన్.. ఐదు సార్లు గ్రాండ్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించడంతో అతనిపై ఫౌల్ ప్లే ఆరోపణలు వచ్చాయి.
నీమాన్కి సరైన కదలికల గురించి చెప్పడానికి వైర్లెస్ సెక్స్ టాయ్ వైబ్రేషన్స్‌ను వినియోగించాడన్న న్యూస్ వైరల్ అయింది. తన షూస్‌లో ఉన్న ప్రోస్టేట్ మసాజర్ ద్వారా కమ్యూనికేట్ అయ్యేలా ఒక కాంట్రాప్షన్ను రూపొందించాడని మీడియా ప్రసారం చేసింది. 'టాలెంట్ మరెవరూ కొట్టలేని లక్ష్యాన్ని చేధిస్తుంది. మేధావి ఎవరూ చూడని లక్ష్యాన్ని చేధిస్తాడు (అది మీ బట్లో ఉంది)' అని ఎలోన్ మస్క్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అయితే ఆరోపణలు ధృవీకరించబడనప్పటికీ సింక్యూఫీల్డ్ టోర్నమెంట్ నిర్వాహకులు అతన్ని బ్యాన్ చేశారు. Chess.com గ్లోబల్ ఛాంపియన్షిప్ కూడా ఆహ్వానాన్ని రద్దు చేసింది.
దీంతో ఈ యంగ్ ప్లేయర్.. ఒంటిపై నూలుపోగు లేకుండా చెస్ ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇదొక్కటే దారి కాగా.. నగ్నంగా ఆడితే ఎక్కువ మంది కూడా చూసే అవకాశం ఉందన్నాడు. ఇక తను మోసగాడినని కాదని తెలిసి కూడా Chess.com అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అన్యాయమన్న హన్ నీమాన్.. కచ్చితంగా టార్గెట్ చేయబడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు.
సింగిల్స్‌తో పోలిస్తే దంపతుల్లోనే శృంగార సంతృప్తి అధికం.. ఎందుకంటే?