తెల్ల జుట్టుకు ఆ నూనెతో ఇలా చెక్ పెట్టండి!

ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు.

Update: 2024-02-16 07:46 GMT

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. యువతి , యువకుల్లో ఈ సమస్యను చూస్తున్నాము. వేలకు వేలు పెట్టి మార్కెట్లో లభించే ఉత్పత్తులను వాడుతున్నారు. దీని వల్ల సమస్య మరింత పెద్దదిగా చేస్తుంది. అయితే, మందులు, ప్రొడెట్స్‌ లేకుండా, ఇంట్లో ఉన్న వాటితోనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

మనం రోజూ భోజనంలో కరివేపాకును ఉపయోగిస్తాం. దీన్ని ఎక్కువగా తాలింపు కూరల్లో వేస్తాము. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే ఇది మన ఆరోగ్యానికే కాదు, జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది. అయితే మీరు నెరిసిన జుట్టుతో బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. కరివేపాకులో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కరివేపాకు నూనె తయారీ విధానం:

ముందుగా ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకుని, మీడియం ఫ్లేమ్ మీద వేడి మీద వేడి చేయండి.ఆ తర్వాత పాన్ లో ఎండు కరివేపాకు వేయాలి. పదినిమిషాలు తక్కువ వేడి మీద నూనెలో ఉంచి, కొద్దిగా వేపనూనె వేయాలి. ఇది చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. కరివేపాకు నూనెను మీ జుట్టుకి అప్లై చేసి, మృదువుగా మసాజ్ చేయండి. ఇలా 30 నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో మీ జుట్టును వాష్ చేసుకోవాలి. ఇది మీకు ఎలాంటి హాని కలిగించదు.అంతే కాకుండా, తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇలా వారానికోసారి ఈ నూనెను ఉపయోగించడం వల్ల మీకు జుట్టు సమస్యలు ఉండవలసిన అవసరం లేదు.


Similar News