శ్వాసకోశ సమస్యలకు ఈ నూనెతో చెక్ పెట్టండి!

పుదీనా నూనె మన చర్మానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ నూనె చర్మ సంరక్షణకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

Update: 2023-03-10 02:38 GMT

దిశ, వెబ్ డెస్క్: పుదీనా నూనె మన చర్మానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ నూనె చర్మ సంరక్షణకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పుదీనా నూనె తలనొప్పి నుంచి శ్వాసకోస ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా నూనె శ్వాసకోశ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీటకాలను తిప్పికొడుతుంది. నోటి దుర్వాసన, పంటి నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. చర్మ సంరక్షణకు పుదీనా నూనెను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు.

ఈ నూనె చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కండరాలలో ఉద్రిక్తతను తగ్గించడానికి సహాయపడుతుంది. తలనొప్పికి పుదీనా నూనెను ఉపయోగించడానికి.. బాదం లేదా కొబ్బరి నూనె వంటినూనెతో కలిపి నుదిటికి, మెడకు అప్లై చేసి మసాజ్ చేయండి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. అలాగే విశ్రాంతిని కలిగిస్తుంది. పుదీన నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, డీకోంగెస్టెంట్ లక్షణాలుంటాయి. ఇది సైనస్లను క్లియర్ చేయడానికి, శ్వాసకోశ వ్యవస్థలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

శ్వాసకోశ ఆరోగ్యానికి పుదీనా నూనెను ఉపయోగించడానికి.. ఒక గిన్నె వేడి నీటిలో కొన్ని చుక్కల పుదీనా నూనెను వేసి ఆవిరిని పీల్చండి. పుదీనా నూనె శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది గొంతు కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే తక్షణ విశ్రాంతిని అందిస్తుంది. దీనిని ఉపయోగించేందకు కొన్ని చుక్కల పుదీనా నూనెను క్యారియర్ ఆయిల్ తో కలపండి. ప్రభావిత ప్రాంతానికి అప్లై చేసి మసాజ్ చేయండి. ఇది కండరాల ఉద్రిక్తతను తగ్గించడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

ఈ ఎసెన్షియల్ ఆయిల్ బలమైన పుదీనా వాసనను కలిగి ఉంటుంది. ఇది దోమలు, చీమలు వంటి కీటకాలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది. కీటకాలను తరిమికొట్టడానికి ఈ నూనెను ఉపయోగించడానికి దీనిని నీటితో కలపండి. మీ ఇంటి చుట్టూ లేదా మీ చర్మంపై స్ప్రే చేయండి. కాటన్ బాల్స్ కు కొన్ని చుక్కల పుదీనా నూనెను వేసి కీటకాలు ఎక్కువగా ఉండే కిటికీలు లేదా తలుపుల పొట్టొచ్చు. దీనిని సరిగ్గా ఉపయోగించడం సురక్షితమే. అయినప్పటికీ దీనిని వాడకానికి ముందు పలుచగా చేయాలి.

దీనిని అధిక సాంద్రతలో ఉపయోగించకూడదు లేదా చర్మానికి నేరుగా పెట్టకూడదు. కళ్ల చుట్టూ లేదా గాయం అయిన చర్మంపై పుదీనా నూనెను అప్లై చేయకూడదు. పుదీనా నూనెను క్యారియర్ ఆయిల్ కు కొన్ని చుక్కలు కలిపి చర్మంపై మసాజ్ చేయొచ్చు. ఇది చర్మపు చికాకు నుంచి ఉపశమనం పొందడానికి, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని అందంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. 

Also Read..

మహిళలు ఎరుపు రంగు బొట్టే ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? 

Tags:    

Similar News