ఆ పండుతో మూత్రపిండాల్లో రాళ్లకు చెక్..

రక్తం తక్కువగా ఉన్నవారు చాలమంది దానిమ్మపండును తింటారు.

Update: 2024-09-21 15:08 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్: రక్తం తక్కువగా ఉన్నవారు చాలమంది దానిమ్మపండును తింటారు. ఈ ఎర్రటి పండు హిమోగ్లోబిన్ పెంచుతుంది. కానీ తాజా ఎరుపు దానిమ్మను తినడం ద్వారా కిడ్నీలో రాళ్లను శాశ్వతంగా తొలగించవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కిడ్నీలో రాళ్లు ఉండడం తీవ్రమైన సమస్య. దీని కారణంగా మూత్ర విసర్జనలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సార్లు కొంతమంది కిడ్నీళ్లో రాళ్ల కారణంగా భయంకరమైన నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది UTI సంక్రమణ ప్రమాదం కలిగిస్తుంది.

దానిమ్మ పండు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా పండ్లు బయటి నుంచి ఎర్రగా కనిపిస్తాయి. కాని లోపల గింజల రంగు లేత ఎరుపు రంగులో ఉంటాయి. వాస్తవానికి దానిమ్మపండు శక్తి దాని ఎరుపు రంగులోనే దాగి ఉంటుంది. ఆంథోసైనిన్ కారణంగా పండులోని గింజలకు ఎరుపు రంగు వస్తుంది. మరి కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడేందుకు తాజా దానిమ్మపండును ఎలా తినాలో, ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు దానిమ్మ ప్రయోజనాలు..

ఆంథోసైనిన్ కారణంగా దానిమ్మ ఎరుపు రంగులో ఉంటుంది. ఈ సమ్మేళనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. టైప్ 2 డయాబెటిస్, నాడీ సంబంధిత వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అవి ప్రయోజనకరమైన రోగనిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

మూత్రపిండాల్లో రాళ్లు..

దానిమ్మ గింజల్లో ఉండే రసం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలలో తేలింది. దానిమ్మను తీసుకోవడం వల్ల రాళ్లకు ప్రధాన కారణాలైన ఆక్సలేట్, కాల్షియం, ఫాస్ఫేట్ రక్తంలో చేరకుండా నిరోధిస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది.

దానిమ్మ రసం..

సర్జరీ లేకుండానే కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే దానిమ్మ రసం తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. విత్తనాలు లేకుండా దానిమ్మ రసం తయారు చేసుకుని తిగారంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

బలం..

అథ్లెట్ లు వర్కౌట్ చేసే సమయంలో సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దానిమ్మ పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఇది మీ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో ఓర్పును, శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో ఆక్సిజన్ పెరగడం వల్ల సులభంగా అలసిపోరు. స్టామినా మెరుగుపరచడానికి, ఖచ్చితంగా ఈ పండు తినాలని సూచిస్తున్నారు.

తాజా ఎరుపు దానిమ్మపండును ఎలా ఎంచుకోవాలి ?

తాజా దానిమ్మపండు కొనడానికి సరైన మార్గం దాని బరువు. తాజా దానిమ్మలో చాలా రసం ఉంటుంది. ముదురు ఎరుపు దానిమ్మ పండును ఎంచుకోండి. పూర్తిగా గుండ్రంగా ఉండే పండ్లను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పచ్చిగా ఉండవచ్చు. దానిమ్మపండును సున్నితంగా నొక్కడానికి ప్రయత్నించండి. గట్టి పండ్లను కొనండి.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News