ఉల్లిఆకులతో క్యాన్సర్‌కు చెక్ పెట్టండి ఇలా!

ఈ రోజుల్లో మనం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నా, అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం, విపరీతంగా బరువు పెరగడం,క్యాన్సర్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు

Update: 2024-02-27 15:02 GMT

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో మనం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నా, అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం, విపరీతంగా బరువు పెరగడం,క్యాన్సర్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు చాలా మందిని వేదిస్తున్నాయి. అందువలన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా,మన తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం వలన ఇలాంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చునంట.

అయితే మన కూర వండుకునే టప్పుడు, అందులో ఉల్లిగడ్డ వేసుకోవడం అనేది చాలా కామన్. కొంత మంది వట్టి ఉల్లిపాయతో కూడా కర్రీ చేసుకుని తింటుంటారు. అయితే ఉల్లిపాయ కాకుండా, ఉల్లి ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రతీ రోజు మనం మన ఆహారంలో ఉల్లి ఆకులు‌ను చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లి ఆకులలో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పోషకాహార లోపాన్ని భర్తీ చేయడానికి సహాయపడుతుంది. అయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యంగా పేగు క్యాన్సర్, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలతో సతమతం అవుతున్నవారు.డైలీ తమ ఆహారంలో ఉల్లి ఆకులను ఉపయోగించాలంట. పచ్చి ఆకులలో ఫోలేట్ ఉంటుందంట. ఇది క్యాన్సర్, అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంటున్నారు వైద్యులు.


Similar News