2060 నాటికి మధ్య ఆసియాకు తీవ్రమైన నీటికరువు!
దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. హిమానీనదాలు, మంచు ఫలకాలు కరిగి సముద్రమట్టాలు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు అంచనా వేశారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. హిమానీనదాలు, మంచు ఫలకాలు కరిగి సముద్రమట్టాలు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ తాజా అధ్యయనం ప్రకారం మరింత వినాశకరమైన కరువు కూడా సంభవిస్తుందని అంచనా. మధ్య ఆసియాలోని ఓ ప్రాంతం 2060 నాటికి ప్రధాన నీటి వనరును పూర్తిగా కోల్పోతుందని, దీనివల్ల అనేక దేశాలకు మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఆసియా 'వాటర్ టవర్'గా పేరుగాంచిన టిబెట్ పీఠభూమిలో రాబోయే కొన్నేళ్లలో తీవ్రమైన కరువు ఏర్పడే అవకాశముందని పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఈ ప్రాంతమంతటా దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలు తమ నీటి అవసరాల కోసం టిబెట్ పీఠభూమిపై ఆధారపడి ఉండగా, ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్‌ను నిరోధించేందుకు సాహసోపేతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంందన్నారు. లేదంటే ఉత్తర భారతదేశం, కశ్మీర్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ సహా మధ్య ఆసియాలోని భూభూగాల్లో నీటి సరఫరా దాదాపు పూర్తిగా లేకుండా పోవచ్చని హెచ్చరించారు.
వాస్తవానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రాంతానికి నీటి వనరుగా ఉన్న 'టిబెట్ పీఠభూమి'కి సంబంధించిన 'టెరెస్ట్రియల్ వాటర్ స్టోరేజ్ (TWS)' గురించి లోతైన అధ్యయనాలు జరగకపోవడంతో.. శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాంత నీటి సరఫరా విలువను లెక్కించేందుకు ఉపగ్రహ, భూ-ఆధారిత కొలతలను పరిశీలించింది. ఈ మేరకు పీఠభూమిలోని TWS 2002 నుంచి 2020 వరకు ఏడాదికి సుమారు 15.8 గిగాటన్లకు పడిపోయినట్లు కనుగొన్నారు. పరిశోధకులు ఈ డేటాను భవిష్యత్తులో TWSను అంచనా వేసేందుకు ఉపయోగించగా, అది మితమైన కార్బన్ ఉద్గారాలు ఉన్నట్లు అంచనా వేయగలిగింది. అంతేకాదు మధ్య ఆసియా, ఆప్ఘనిస్థాన్ మంచినీటిలో 119శాతం క్షీణతను అనుభవిస్తాయని.. ఉత్తర భారతదేశం, కశ్మీర్, పాకిస్థాన్ 79శాతం క్షీణతను చూస్తాయని పరిశోధకులు అంచనా వేశారు. తద్వారా ఈ ప్రాంతంలో నివసించే బిలియన్ల మంది ప్రజల కరువుకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.
రాబోయే దశాబ్దాల్లో టిబెటన్ పీఠభూమి దిగువ ప్రాంతాలకు నీటి లభ్యత దాదాపుగా 100 శాతం నష్టాన్ని, అంటే దాదాపుగా పతనాన్ని చూసే అవకాశముంది. వాతావరణ మార్పులు, భూమి గతంలో కంటే ఎక్కువ వేడెక్కడం.. నీటి టవర్ల పతనానికి కారణమవుతున్నాయి. వీటిని తగ్గిస్తే ఆశాజనక ఫలితాలు చూడొచ్చు. కానీ నష్టాలను మాత్రం తప్పించుకోలేము.
- మైఖేల్ మాన్, మెటరాలాజిస్ట్, పెన్ స్టేట్ యూనివర్సిటీ
కుక్కలను హింసించిన సెక్యూరిటీ గార్డ్.. మహిళ చేసిన పనికి అంతా షాక్