జుట్టుకు మేలు చేసే క్యారెట్‌ ఆయిల్..

Update: 2023-02-23 15:13 GMT

దిశ, సినిమా: క్యారెట్‌లో హెవీ ప్రోటీన్లు ఉంటాయి. దీనిని తిన్న కూడా లాభం తప్పమే నష్టం మాత్రం జరగదు. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం గుండె, మెదడు, మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తరచు క్యారేట్ తినడం మూలంగా డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుంది. దీనిలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే క్యారెట్‌లో ఉండే విటమిన్‌ ఏ, కె, సీ, బి6, బి1, బి3, బి2, ఫైబర్‌, పొటాషియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతూ, పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

క్యారెట్ ఆయిల్ తయారి..


ముందుగా మీడియం సైజ్‌ క్యారెట్‌ తీసుకుని తురుముకోవాలి. ఆ క్యారెట్ తురుమును సీసాలో వేసి, అందులో ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. ఈ బాటిల్‌కు మూతపెట్టి, ఒక వారం రోజుల పాటు చీకటి గదిలో ఉంచండి. ఒక వారం తర్వాత సీసాలోని నూనె నారింజ రంగులోకి మారుతుంది. దీన్ని వడపోసి మరో సీసాలో స్టోర్‌ చేసుకోండి. ఈ నూనెను మీ తలకు, జుట్టుకు పట్టించి అరగంట తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. దీంతో పాటుగా చుండ్రు, జుట్టు పొడిబారటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టును హైడ్రేటెడ్‌గా, షైనీగా ఉంచుతుంది.

క్యారెట్‌‌తో హేయిర్ ప్యాక్..

ముందుగా మన జుట్టుకు సరిపడా క్యారెట్‌లను తీసుకుని, తొక్క తీసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో ఆలివ్‌ ఆయిల్‌ ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి, మొత్తగా పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి గంటసేపు ఆరనీవండి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపుతో తలస్నాం చేయండి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును మృదువుగా, బలంగా మారుస్తాయి. దెబ్బతిన్న జుట్టును రిపేర్‌ చేస్తాయి. ఈ ప్యాక్‌లోని తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. ఆయివ్‌ ఆయిల్‌ జుట్టు మెరిసేలా చేస్తుంది. నెలకు కనీసం రెండు సార్లు ఈ హెయిర్‌ మాస్క్‌ను ఉపయోగించండి మంచి రిజల్ట్ ఉంటుంది.

Tags:    

Similar News