బాత్రూంలోకి వెళ్లేంతలోనే ప్యాంట్ తడిసిపోతుందా? ఈ యోగాసనాలతో చెక్ పెట్టండి
చాలా మంది మూత్ర సమస్యలతో బాధపడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది మూత్ర సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమంది బాత్రూంలోకి వెళ్లేలోపే తడిపేసుకుంటారు. మరికొంతమంది బరువులు ఎత్తినప్పుడు, తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు కూడా మూత్రం దానందట అదే తమ నియంత్రణ లేకుండా పోస్తుంటారు. అలాగే ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్లినా పూర్తిగా ఖాళీగా అయినట్లు అనిపించని భావన కలగడం, దీంతో తరచూ టాయిలెట్ వెళ్లాలనిపించడం వంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఎదుర్కొంటారు. కాగా మీ నియంత్రణ లేకుండా మూత్రం పడినట్లైతే పలు యోగాసనాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
* చక్రాసనం..
ముందుగా నిటారుగా నిల్చోని మీ హ్యాండ్స్ ను పక్కకు ఆనించి.. పాదాల మధ్య కాస్త ఎడం ఉంచండి. తర్వాత మీ చేతులను చెవులకు తాకేలా పైకి నిటారుగా ఎత్తి, స్లోగా హ్యాండ్స్ తో సహా వెనక్కి వంగి ఉండండి. తర్వాత శ్వాస తీసుకుంటూ మీకు సాధ్యమైనంత సేపు ఉండండి. దీంతో కటి ప్రాంత కండరాల్ని స్ట్రాంగ్ చేసి టాయిలెట్ మీ నియంత్రణలో ఉండేటట్లు చేస్తుంది.
*కోణాసనం..
రైట్ హ్యాండ్ చేతి వేళ్లతో లెఫ్ట్ కాలును పట్టుకుని వంగి ఉండండి. తర్వాత ఎడమ చేతిని పైకి లేపి, ఇదే స్థితిలో ఉండి మెల్లిగా శ్వాస తీసుకోండి. మధ్య మధ్యలో చేతిని మార్చండి. దీంతో వెన్నె కండరాలను, నడుమును బలపరుస్తుంది. మూత్రం నియంత్రణను పెంచుతుంది.
పశ్చిమోత్తాసనం..
ముందుగా ఒక ప్రశాంతమైన ప్లేస్ ఎంచుకుని అక్కడ నేలపై కూర్చోండి. రెండు కాళ్లు చాపి శ్వాస తీసుకుంటూ ముందుకు వంగి హ్యాండ్స్ తో పాదాల బొటన వేలును పట్టుకుని వెనక్కి లాగడానికి ట్రై చేయండి. అలాగే మళ్లీ శ్వాస మెల్లిగా వదులుతూ ముందు స్థితికి రండి. కటి ప్రాంతాన్ని, నడుము ప్రాంతాన్ని స్ట్రాంగ్ గా చేస్తుంది. దీంతో యూరిన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.