ధనవంతులకే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!

ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ అంటూ ఈ వ్యాధులు ప్రజలపై దాడి చేసి వారి ప్రాణాలతో చెలగాటం

Update: 2024-06-05 08:08 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ అంటూ ఈ వ్యాధులు ప్రజలపై దాడి చేసి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అయితే చాలా వరకు పేదలతో రోగాలు ఎక్కుగా ఆటలు ఆడుతుంటాయని అంటుటారు. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. డబ్బు ఉన్నవారికే ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

అసలు విషయంలోకి వెళ్లితే.. ఫిన్లాండ్‌లోని హెల్సింకి యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సర్వేలో ఫైనాన్షియల్ స్టేటస్, వ్యాధుల మధ్య సంబంధాన్ని తెలియజేసింది. ఇందులో ఆర్థికంగా బాగా ఉన్నవారే ఎక్కువ క్యాన్సర్ బారినపడుతున్నట్లు వారు తెలిపారు. పేద ప్రజలతో పోలిస్తే సంపన్నులకే జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వాళ్లు తేల్చి చెప్పారు. 35 నుంచి 80 సంవత్సరాల వయసు గల మధ్యలో ఉన్న 2,80,000ల మందిని ఎంపిక చేసి వారి ఫైనాన్షియల్ స్టేటస్, జన్యుసంబంధాన్ని సేకరించి పరిశోధించగా అందులో ఆర్థికంగా వెల్ సెటిల్ ఉన్నవారికే క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వారు పేర్కొన్నారు.


Similar News