వర్షం నీరు తాగొచ్చా.. పరిశోధనల్లో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు

నిపుణులు పలు పరిశోధనలు చేసి షాకింగ్ విషయాలు వెల్లడించారు

Update: 2024-07-12 07:36 GMT

దిశ, ఫీచర్స్: వానాకాలం ప్రారంభమైంది. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు, మూడు మంచి వానలు పడడంతో ఎండ నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. వర్షాలు ఎక్కువగా పడి చెరువులు నిండితే నీటి కొరత భాద పోతుంది. కొందరు వర్షపు నీటిని నిల్వ చేసి తాగుతుంటారు. వర్షపు నీరు తాగొచ్చా? ఇవి మన శరీరానికి మంచిదా.. కాదా? అయితే, దీని గురించి నిపుణులు పలు పరిశోధనలు చేసి షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

వర్షం నీరు మనుషులకు అంత మంచివి కావు.. ఒక వేళ మంచివి అయితే ఏళ్ల తరబడి వానలు కురుస్తున్న సమయంలో నీటిని దాచుకునే వాళ్ళు. వీటిలో సూక్ష్మ కణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కణాలు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ట్యాప్ వాటర్ కంటే వర్షం నీటిలో ఆల్కలీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ నీటి వల్ల మీరు ఎన్నో సమస్యలు వస్తాయని పరిశోధనలు చేసి నిపుణులు వెల్లడించారు.

వర్షపు నీటిని తాగడానికి తప్ప ఇంట్లో పనుల కోసం చక్కగా వాడవచ్చు. వంట గదిలో పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం, ఇంటిని క్లీన్ చేయడం, మొక్కలకు నీటిని పోయడం వంటి వాటిని ఉపయోగించవచ్చు. గర్భిణీలు, ఇమ్మ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, బీపీ సమస్యలు ఉన్న వారు వర్షపు నీటిని దగ్గరకు కూడా రానివ్వకూడదు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News