Monkey Pox : మశూచి వ్యాక్సిన్ మంకీపాక్స్ వైరస్ నుండి రక్షించగలదా ?
ప్రపంచంలోని అనేక దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని అనేక దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆఫ్రికా తర్వాత ఈ వైరస్ స్వీడన్ నుంచి పాకిస్థాన్‌కు వ్యాపించింది. భారత్‌కు కూడా కేసులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తమై మంకీ ఫాక్స్ కి చికిత్స అందించేందుకు ఆస్పత్రులను సిద్ధం చేసింది. మంకీపాక్స్ కూడా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించే ఒక అంటు వ్యాధి. కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ మరణానికి కారణమవుతుంది. అందుకే నిపుణులు నివారణ చర్యలను సూచిస్తున్నారు.
మంకీపాక్స్, మశూచి వైరస్ ల లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ కూడా మశూచి కుటుంబానికి చెందిన వైరస్. ఇది చాలా దశాబ్దాల క్రితం ఆఫ్రికా నుండి ప్రారంభమైంది. ఈ వైరస్ కోతుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.
1980 తర్వాత జన్మించిన వారికి మంకీ పాక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ ?
1960 నుండి 1970 వరకు ప్రపంచవ్యాప్తంగా మశూచి వైరస్ కేసులు చాలా ఉన్నాయి. ఈ వైరస్ నుండి రక్షించడానికి, పెద్ద ఎత్తున మశూచి వ్యాక్సిన్‌తో టీకాలు వేశారు. దీంతో ఈ కేసులు తగ్గడం ప్రారంభించాయి. 1980 సంవత్సరం నాటికి మశూచి కేసులు రావడం ఆగిపోయింది. 1980లో WHO మశూచి వ్యాధి పోయినట్లు ప్రకటించింది. ఆ తరువాత దాని టీకా కూడా నిలిపివేశారు. 1980 వరకు పుట్టిన పిల్లలకు మాత్రమే మశూచి వ్యాక్సిన్ వేయించారు. ఆ తర్వాత వారికి టీకాలు వేయలేదు. 1980కి ముందు జన్మించిన చాలా మంది ప్రజలకు మశూచి రాకుండా టీకాలు వేసినందుకు వారికి ఈ మంకీ పాక్స్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.
మశూచి వ్యాక్సిన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుంది ?
ఎపిడెమియాలజిస్ట్ మాట్లాడుతూ 1980 వరకు జన్మించిన వారికి మశూచి వ్యాక్సిన్‌లు వేశారన్నారు. అందుకే ఇతర వ్యక్తులతో పోలిస్తే వారికి మంకీపాక్స్ ప్రమాదం తక్కువగా ఉంటుందంటున్నారు. అయితే మశూచి రాకుండా టీకాలు వేసిన వ్యక్తులకు మంకీ పాక్స్ వచ్చినా లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉండవని అంటున్నారు.
మశూచి వ్యాక్సిన్.. ?
2022లో అమెరికా, యూరప్‌లలో మంకీ పాక్స్ వ్యాధి సోకినప్పుడు ఆ దేశాల్లో మశూచి వ్యాక్సిన్‌లు జిన్నెయోస్, ఎసిఎఎమ్ 2000 వేశామని, అయితే మశూచి వ్యాక్సిన్‌ని డబ్ల్యూహెచ్‌వో భారత్‌లో నిర్మూలించిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత దాని వ్యాక్సిన్ భారతదేశంలో తయారు చేయలేదన్నారు. ఈ వ్యాక్సిన్ అమెరికా, రష్యాలోని ల్యాబ్‌లలో మాత్రమే అందుబాటులో ఉందంటున్నారు నిపుణులు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.