కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ తినవచ్చా.. వైద్యులు ఏమి చెబుతున్నారంటే..?
ప్రస్తుతం చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టాలి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా తమ ఆహారంలో బీట్ రూట్ ని చేర్చుకోకూడదు. అవి తిన్నప్పుడు, మూత్రపిండాలు మరింత అనారోగ్యానికి గురవుతాయి. దీన్ని మితంగా తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయలు. ఎందుకంటే, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇందులో ఆక్సలేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఆక్సలేట్స్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఆహారం గురించి కొన్ని ముఖ్యమైన చిట్కాలు:
ఉప్పు తీసుకోవడం తగ్గించండి: ఉప్పు రక్తపోటును పెంచుతుంది, ఇది మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
ఫాస్పరస్ తీసుకోవడం తగ్గించండి: ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహారాలు మీ కిడ్నీలను దెబ్బతీస్తాయి.
పొటాషియంను నియంత్రించండి: పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి హానికరం.
మంచి నీరు త్రాగాలి: బీట్ రూట్ తినే సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆక్సలేట్స్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు.
వైద్యునితో మాట్లాడండి: మీకు కిడ్నీ సమస్యలు ఉంటే, బీట్ రూట్ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.