దోమలు మనల్ని చూస్తాయా? మనుషుల్ని కుట్టేది ఆడవా.. మగవా..?
రక్తాన్ని పీల్చి చాలా వ్యాధులకు కారణమవుతున్న కీటకము దోమ. వీటిలో ముఖ్యంగా మూడు రకాల దోమలు వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి.
దిశ, వెబ్‌డెస్క్ : రక్తాన్ని పీల్చి చాలా వ్యాధులకు కారణమవుతున్న కీటకము దోమ. వీటిలో ముఖ్యంగా మూడు రకాల దోమలు వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. అవి కులిసిడే కుటుంబానికి చెందిన క్యూలెక్స్, అనాఫిలస్, ఈడిస్ దోమలు. వీటి దేహంలో తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుంటాయి. మధ్యవక్షానికి ఒక జత రెక్కలు ఉంటాయి. అంత్యవక్షానికి చెందిన రెక్కలు 'హాల్టర్లు'గా ఉండి శరీర సమతాస్థితికి పనిచేస్త్రాయి. ఆడ దోమలలో గుచ్చి పీల్చేరకమైన ముఖభాగలుంటాయి. ఇవి మానవులమీద అంతరాయక బాహ్య పరాన్న జీవులుగా బతుకుతాయి. మగ దోమలు మొక్క స్రావాల మీద బతుకుతాయి.
దోమలు మనల్ని చూడలేవు. ఎందుకంటే వాటికి అసలు కళ్లు ఉండవు. రెక్కలే చెవులు.. వాటి సహాయంతోనే అవి ఎదురుగా ఏమున్నది అని కనుక్కుంటాయి. దోమలు తమ రెక్కల సహాయంతో శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ శబ్ద తరంగాలు అలలు అలలుగా ప్రయాణం చేస్తాయి. అప్పుడు దోమ తమకు సమీపంలో ఏదో జీవులు ఉన్నట్లు తెలుసుకుని చుట్టూ మూగి గుయ్యిమని శబ్దంతో తమ ఉనికి చాటుకుంటాయి.
ఇవి కూడా చదవండి :