కూతురు పిండప్రదానం చేయవచ్చా..? ఆ సమయంలో తెల్ల చీరనే కట్టుకోవాలా..?
భారత దేశం అంటేనే కట్టుబాట్లకు, హిందూ సంప్రదాయాలకు పెట్టింది పేరు.
దిశ, వెబ్‌డెస్క్ : భారత దేశం అంటేనే కట్టుబాట్లకు, హిందూ సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ పిండప్రదానం కూడా ఓ సంప్రదాయంగానే కొనసాగుతుంది. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి ఆత్మశాంతించాలని కొడుకులు పిండప్రదానం చేస్తారు. అయితే పిండప్రదానం కొడుకులు మాత్రమే చేయాలా అనేది చాలామందికి వచ్చే సందేహం. ఒకవేళ ఎవరైనా చనిపోయినప్పుడు వారికి కొడుకులు లేకపోతే ఎవరు పిండప్రదానం చేయాలి, కూతురు చేయొచ్చా అనే సందేహాలు అనేకం వస్తుంటాయి. మరి ఆ సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం..
కుటుంబంలోని పెద్దలు చనిపోయినప్పుడు కొడకులు లేని పక్షంలో కుమార్తెలు పిండాన్ని దానం చేయవచ్చని శాస్త్రం చెబుతుంది. హిందూ గ్రంధాల ప్రకారం తండ్రి మరణానంతరం వారి ఆత్మశాంతి కోసం, బంధాల నుండి విముక్తి చేయడానికి కొడుకులు పిండదానం, తర్పణం చేయాలి. ఒకవేళ పిండప్రదానం, తర్పణం చేయనిపక్షంలో పితృదేవతల ఆత్మకు మోక్షం లభించదట. ఎవరికైతే కుమారులు ఉండరో వారి కుమార్తెలు తర్పనం వదలవచ్చని గ్రంధాలు చెబుతున్నాయి. పిండదానాన్ని పుత్రులు చేస్తేనే కాని పూర్వీకుల ఋణం తీరదని అంటారు. కానీ తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు కూతురు కూడా పిండదానాన్ని చేయవచ్చు. ఇక పిండప్రదానం సమయంలో తెల్లనిదుస్తులు ధరించాలి. పిండదానం చేసిన అనంతరం నదిలో స్నానం చేయాలి.
ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు పితృ పక్షం ప్రారంభమవుతుంది. పితృపక్షం సుమారుగా 15 రోజుల ఉండి అమావాస్యతో ముగుస్తుంది. ఈ పితృపక్షం పితృదేవతలు పక్షుల రూపంలో భూమిపైకి వచ్చి వారి కుటుంబ సభ్యులను కలుస్తారని శాస్త్రం చెబుతుంది. ఆ రోజున పితృదేవతలను భక్తితో పూజిస్తే వారి ఆత్మశాంతించి కుటుంబానికి ఆశీర్వచనాలు ఇస్తారట.
Read More: నిజానికి మీరు చనిపోవడం అంటూ ఉండదని తెలుసా?