"Buy now, pay later" ఇప్పుడు కొనేసి.. తర్వాత చెల్లించాలా?
పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో 'ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి(Buy now, pay later) ఆప్షన్‌కు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా సాంప్రదాయ క్రెడిట్‌కు అవకాశంలేని యువకులు,
దిశ, ఫీచర్స్: పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో 'ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి(Buy now, pay later) ఆప్షన్‌కు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా సాంప్రదాయ క్రెడిట్‌కు అవకాశంలేని యువకులు, తక్కువ-ఆదాయ వినియోగదారుల్లో ఈ ట్రెండ్ పాపులరైంది. ఇక బట్టలు లేదా ఫర్నిచర్, స్నీకర్స్ లేదా కాన్సర్ట్ టిక్కెట్స్ కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నపుడు చెక్అవుట్‌లో సదరు ఖర్చును చిన్న ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా విభజించే ఎంపికను చూసే ఉంటారు. Afterpay, Affirm, Klarna, Paypal, Flipkart తదితర కంపెనీలు ఈ తరహా సేవలందిస్తుండగా.. Apple కూడా ఈ ఏడాది చివరన మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. కానీ ఆర్థిక అస్థిరత పెరగడంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ విషయంలో వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటి? చెల్లింపు విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
'వడ్డీ రహిత రుణాలు'గా పరిగణిస్తున్న ఈ Buy now, pay later సేవల కోసం ముందుగా సదరు యాప్‌లో బ్యాంక్ ఖాతా లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయాలి. ఇక వీక్లీ లేదా నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు సైన్ అప్ చేయడం అవసరం. క్లార్నా, ఆఫ్టర్‌పే వంటి కొన్ని కంపెనీలు రుణగ్రహీతలను ఆమోదించే ముందు క్రెడిట్ బ్యూరోలకు నివేదించబడని సాఫ్ట్ క్రెడిట్స్‌ను చెక్ చేస్తాయి. చాలా వరకు నిమిషాల్లో ఆమోదించబడతాయి. ఆ తర్వాత షెడ్యూల్డ్ పేమెంట్స్ కస్టమర్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతాయి లేదా వారి కార్డ్‌పై చార్జ్ చేయబడతాయి. సాధారణంగా టైమ్ ప్రకారం పేమెంట్ చేస్తే సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆలస్యంగా చెల్లిస్తేనే ఫ్లాట్ ఫీజు లేదా మీరు చెల్లించాల్సిన మొత్తంలో శాతంగా లెక్కింపబడిన రుసుము(వడ్డీతో కలిపి దాదాపు రూ.2700) చెల్లింపును సదరు కంపెనీలు అమలు చేయగలవు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు చెల్లింపులు చేయలేకపోతే మీరు భవిష్యత్తులో ఆ సేవను ఉపయోగించలేరు. పర్యవసానంగా ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు హాని కలిగించవచ్చు.
నా కొనుగోలు సురక్షితమా?
యూఎస్‌లో Buy now, pay later సేవలు.. క్రెడిట్ కార్డ్స్, ఇతర రకాల రుణాలను(నాలుగుకు పైగా వాయిదాల్లో తిరిగి చెల్లించినవి) నియంత్రించే ట్రూత్ ఇన్ లెండింగ్ చట్టం పరిధిలోకి రావు. అంటే వ్యాపారులతో వివాదాలను పరిష్కరించుకోవడం, వస్తువులను వాపస్ చేయడం లేదా మోసం జరిగిన సందర్భాల్లో డబ్బును తిరిగి పొందడం కస్టమర్లకు మరింత కష్టం. ఈ విషయంలో కంపెనీలు ప్రొటెక్షన్స్ అందిస్తున్నాయి. కానీ అవి అవసరం లేదు. కాబట్టి రుణగ్రహీతలు వీలైతే By now pay later యాప్స్‌లో క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. లింక్ చేస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి పొందే ప్రొటెక్షన్స్ కోల్పోతారు కనుక నేరుగా ఉపయోగించడమే ఉత్తమం.
ఇతరత్రా ప్రమాదాలు..
Buy now, pay later గురించి సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ లేనందున.. సదరు అప్పులు మీ క్రెడిట్ ప్రొఫైల్‌లో ప్రధాన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల్లో కనిపించవు. అంటే మీరు ఇతర కంపెనీల వద్ద ఎన్ని రుణాలు తీసుకున్నారో రుణదాతలకు తెలియనందున.. తదుపరి కొనుగోలు సామర్థ్యం లేకపోయినప్పటికీ ఇతర కంపెనీలు మిమ్మల్ని మరిన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతించవచ్చు. అంతేకాదు మీరు టైమ్ ప్రకారం చేసే చెల్లింపులు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల్లో నమోదు కావు. కానీ మిస్డ్ పేమెంట్స్ మాత్రం తప్పకుండా రికార్డ్ అవుతాయి. ఇలా క్రెడిట్ స్కోర్ పెంచుకునే విషయంలో సాయపడకపోగా.. తగ్గడంలో మాత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రిటైలర్లు ఈ సర్వీస్‌ను ఎందుకు ఆఫర్ చేస్తారు?
రిటైలర్లు Buy now, pay later సర్వీసెస్‌లో బ్యాకెండ్ రుసుములను అంగీకరిస్తారు. ఎందుకంటే కొనుగోళ్లకు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇచ్చినప్పుడు కస్టమర్లు ఒకేసారి ఎక్కువ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పైగా క్రెడిట్ కార్డ్ పొందడం ప్రాసెస్‌తో కూడిన వ్యవహారం(ఉత్తమ క్రెడిట్ స్కోర్ ఉండాలి) కావడంతో చాలా మంది ఈ Pay later సేవలను ఉపయోగించుకుంటున్నారు. వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఈ సేవలను అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఎవరు ఉపయోగించాలి?
అన్ని పేమెంట్స్‌ను టైమ్ ప్రకారం చెల్లించగలిగే సామర్థ్యముంటే Buy now, pay later రుణాలు వినియోగదారుకు ఆరోగ్యకరమైన, ఉత్తమ వడ్డీ రహిత సేవలు. కానీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలని భావిస్తూ సమయానికి చెల్లింపులు చేయగలిగితే మాత్రం క్రెడిట్ కార్డ్ ఉత్తమ ఎంపిక. మోసాల నుంచి బలమైన లీగల్ ప్రొటెక్షన్, రుణాలకు సంబంధించి స్పష్టమైన సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్‌ను ఇందులో పొందవచ్చు. ఒకవేళ Buy now, pay later చెల్లింపుల విషయంలో అనిశ్చితి ఉంటే గతంలో వసూలు చేసిన రుసుములను ఒకసారి పరిశీలించండి. క్రెడిట్ కార్డ్ కంపెనీ లేదా ఇతర రుణదాతలు విధించే పెనాల్టీలు, వడ్డీ కంటే కూడా పై సేవలు ఎక్కువ చార్జీలను విధిస్తాయి.
ఆర్థిక అస్థిరతను ఎలా ప్రభావితం చేస్తుంది?
జీవన వ్యయం పెరిగే కొద్దీ కొంతమంది దుకాణదారులు ఎలక్ట్రానిక్స్ లేదా డిజైనర్ క్లాత్స్ వంటి పెద్ద వస్తువుల కంటే అవసరమైన వాటిపై పేమెంట్స్ బ్రేక్ చేయడం ప్రారంభించారు. ఈ వారం విడుదలైన్ మార్నింగ్ కన్సల్ట్ పోల్‌లో 15% Buy now, pay later కస్టమర్స్ కిరాణా సామాగ్రి, గ్యాస్ వంటి సాధారణ కొనుగోళ్ల కోసం ఈ సేవను ఉపయోగిస్తున్నారని వెల్లడికావడం ఆర్థిక సలహాదారుల్లో అలారం గంటలు వినిపిస్తున్నాయి. ఈ సర్వీస్‌లో పెరుగుతున్న పెనాల్టీ పేమెంట్స్ వల్ల వినియోగదారుల రుణాలు భారంగా పరిణమిస్తున్నాయి.