బిజీ షెడ్యూల్ వల్ల హెల్త్‌పై శ్రద్ధ పెట్టట్లేదా.. బయట ఫుడ్ కాకుండా వర్క్ ప్లేస్‌లోనే ఇవి తీసుకోండి!

ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుకుల జీవితంలో సరిగా తింటి కూడా తినలేని పరిస్థితి నెలకొంది.

Update: 2024-09-16 10:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుకుల జీవితంలో సరిగా తింటి కూడా తినలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఒత్తిగా, సరైన నిద్ర లేకపోవడం, నాణ్యమైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనిషి పలు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు. కానీ హెల్త్ పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కాగా అప్పటికప్పుడు బయట ఎక్కడ ఏం కనిపించిన తినడం కాకుండా.. మీరు వర్క్ చేసే ప్లేస్‌లోనే ఈ స్నాక్స్ తీసుకుంటే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మీరు పనిమీద బయటికెళ్లిన, డ్యూటీకి వెళ్లిన డ్రై ఫ్రూట్స్ వెంట తీసుకెళ్లండి. కారులో అయినా వర్క్ ప్లేస్‌లో తినండి. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. చక్కెరలు, ఫైబర్ పుష్కలంగా ఉండే డ్రైఫ్రూట్స్ బాడీకి తగినంత ఎనర్జీని ఇస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను మెరుగుపరుస్తుంది.

వర్క్ ప్లేస్‌లోనే స్నాక్స్‌గా నట్స్ తినండి. కూరగాయలు,గింజలు వంటివి తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. కూరగాయలను ఆవిరి మీద ఉడికించి బాక్స్‌లో తీసుకెళ్లి తినండి. అలాగే షుగరీ డ్రింక్స్ కాకుండా స్మూతీస్ వంటివి తాగండి. హెర్బల్ టీని ప్రిఫర్ చేయండి. హెల్తీ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాలకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆపిల్ ముక్కల్ని ఆల్మండ్ బటర్ తో తినండి.

జంక్ ఫుడ్, చాక్లెట్స్, చిప్స్, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, మిల్లెట్ స్నాక్స్, ఆహార పదార్థాలు, సాల్ట్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవద్దు. ఎక్కువ కాలం ఉండే హెల్త్ స్నాక్స్‌ను ఇంట్లో రెడీ చేసుకోవడం బెటర్.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News