బౌద్ధ సన్యాసులపై పరిశోధనలు.. పేగుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్న ధ్యానం
ధ్యానం.. నిరాశ, ఆందోళన, గుండె జబ్బులు, ఒత్తిడిని డీల్ చేయడంలో సహాయపడతాయని మునుపటి అధ్యయనాలు రుజువు చేశాయి.
దిశ, ఫీచర్స్: ధ్యానం.. నిరాశ, ఆందోళన, గుండె జబ్బులు, ఒత్తిడిని డీల్ చేయడంలో సహాయపడతాయని మునుపటి అధ్యయనాలు రుజువు చేశాయి. అయితే టిబెటన్ బౌద్ధ సన్యాసులపై చేసిన దీర్ఘకాలిక అధ్యయనం.. మెడిటేషన్‌తో గట్ బ్యాక్టీరియా కూర్పు సానుకూలంగా ప్రభావితం అవుతుందని.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిర్ధారించింది. ఇందుకోసం మూడు టిబెటన్ దేవాలయాలకు చెందిన 37 మంది బౌద్ధ సన్యాసులు, సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న 19 మంది సాధారణ పౌరుల మలం, రక్ల నమూనాలను విశ్లేషించారు.
ఇక సన్యాసులు 'ఆయుర్వేదం' అని పిలువబడే పురాతన భారతీయ వైద్య విధానం నుంచి తీసుకోబడిన ధ్యాన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. వీరిలో రోజుకు సగటున రెండు గంటల పాటు 30ఏళ్లుగా ధ్యానాన్ని అభ్యసిస్తున్న వారు ఉన్నారు. కాగా స్టూల్ సాంపిల్స్ విశ్లేషణ సన్యాసుల గట్‌లు అనేక బ్యాక్టీరియా జాతులతో గణనీయంగా సమృద్ధిగా ఉన్నాయని వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా మానసిక అనారోగ్యం ఉపశమనానికి సంబంధించినదిగా గుర్తించారు. మైక్రోబయోటా కూర్పు ఆందోళన, నిరాశ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరంలో రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు సూక్ష్మజీవులు వాటి వాపు స్థాయిలు, జీవక్రియను ప్రభావితం చేస్తాయని విశ్లేషణ సూచించింది. ప్రివోటెల్లా, బాక్టీరాయిడ్స్ అనే బ్యాక్టీరియా జాతులు ధ్యాన సమూహంలో చాలా గణనీయంగా సమృద్ధిగా ఉన్నాయి. ఈ రెండు జాతులు గతంలో సానుకూల మానసిక ఆరోగ్యం, నిరాశ, ఆందోళన తక్కువ రేట్లతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇక సన్యాసులలో కొలెస్ట్రాల్ మార్కర్స్‌ను ఇతర సమూహంతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయని రక్త నమూనాలు వెల్లడించాయి.
ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మరింత పరిశోధించాలి. దీర్ఘకాలిక లోతైన ధ్యానం గట్ మైక్రోబయోటాపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇది శరీరం యొక్క సరైన ఆరోగ్య స్థితిని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఈ అధ్యయనం మానవ పేగును నియంత్రించడంలో దీర్ఘకాలిక లోతైన ధ్యానం యొక్క పాత్రకు సంబంధించి కొత్త ఆధారాలను అందిస్తుంది. ఇది మానసిక పరిస్థితులు, శ్రేయస్సులో సానుకూల పాత్ర పోషిస్తుంది
- పరిశోధకులు