వ్యాపార రంగంలో No.1 వ్యాపారవేత్తగా నిలవాలనుకుంటున్నారా? అయితే బౌద్ధమతాన్ని స్వీకరించండి..

బౌద్ధమతం ఆధ్యాత్మిక జ్ఞానోదయం, ప్రశాంతమైన మనస్సు, శరీరాన్ని అందిస్తుంది.

Update: 2023-09-06 11:13 GMT

దిశ, ఫీచర్స్: బౌద్ధమతం ఆధ్యాత్మిక జ్ఞానోదయం, ప్రశాంతమైన మనస్సు, శరీరాన్ని అందిస్తుంది. అయితే వేగవంతమైన వ్యాపార ప్రపంచంలో పోటీదారులను ఓడించడంలోనూ సహాయపడుతుందని తాజా అధ్యయనం చెప్తోంది. థాయిలాండ్, తైవాన్‌లోని 331మంది ఎంట్రప్రెన్యూర్స్‌పై చేసిన సర్వేలో బిజినెస్‌లో రాణించడంలో బుద్ధిజమ్ ఎఫెక్ట్ గురించి వివరించింది. ఇందులో పార్టిసిపెంట్స్‌ను వారి వ్యవస్థాపక ధోరణి, రిలీజియస్ కమిట్మెంట్, స్ట్రెస్ టోలరెన్స్‌పై పలు ప్రశ్నలు అడిగిన సైంటిస్టులు.. బౌద్ధులలో ఎంట్రపెన్యూరియల్ ఓరియంటేషన్ బౌద్ధేతరుల కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఒత్తిడికి నాలుగు శాతం అధిక స్థాయి సహనాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు.

బౌద్ధమతం సాధారణంగా నైతిక ధర్మాలను అభ్యసించడం, సంకల్ప శక్తిని పటిష్టం చేయడం, జ్ఞానాన్ని పదును పెట్టడం ద్వారా విముక్తికి మార్గంగా వర్ణించబడింది. బౌద్ధ తత్వశాస్త్రం వాస్తవిక సారాంశాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా బిజినెస్‌మెన్ వ్యాపార రంగంలో పరిస్థితిని విశ్లేషించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బుద్ధిజమ్ ఫాలో కావడంతో సెల్ఫ్ - డిసిప్లెన్, సెల్ఫ్- ఇంప్రూమెంట్‌, సొసైటీ రెస్పాన్సిబిలిటీ గురించి నేర్చుకున్న బుద్ధిస్ట్స్.. పాజిటివ్ మైండ్‌సెట్‌ను అలవరుచుకుంటారు. వ్యాపార అభివృద్ధి, పరిశ్రమ పోకడలను చురుగ్గా అన్వేషించేందుకు, కొత్త ఆవిష్కరణలకు అనుగుణంగా అప్‌డేట్ అయ్యేందుకు, ఒత్తిడిలో ఉన్నా సృజనాత్మకంగా ఉండేందుకు.. తద్వారా వ్యాపారంలో సామాజిక, ఆర్థిక లాభాలు పొందేందుకు సహాయపడుతుంది.

Tags:    

Similar News