ప్లీజ్ మీ వక్షోజాలు చూసుకోండి.. డేంజర్ జోన్‌లో పురుషులు (వీడియో)

ఈ వీడియో కొందరికి ఆక్వర్డ్‌గా ఉండొచ్చు, జుగుప్స కలిగించొచ్చు. కొందరికి ఏంటి ఇలా పబ్లిక్‌గా మాట్లాడుతుందని అనిపించొచ్చు.

Update: 2023-10-28 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ వీడియో కొందరికి ఆక్వర్డ్‌గా ఉండొచ్చు, జుగుప్స కలిగించొచ్చు. కొందరికి ఏంటి ఇలా పబ్లిక్‌గా మాట్లాడుతుందని అనిపించొచ్చు. కానీ కొన్ని విషయాలను మాట్లాడడానికి, అవగాహన కలిగించడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో స్త్రీ,పురుషులంతా చూడవచ్చు. సెన్సిటివ్ అంశాలను పరదా వెనుక దాస్తే ప్రాణాలను మింగేసే పెనుభూతాలను మనమే పెంచి పోషించినట్టు అవుతుంది.

మన దేశంలో ఒక ఆడది వాష్ రూమ్ ఎక్కడ ఉంది అని అడగడానికి కూడా ఆలోచిస్తుంది. తను రోజూ పని చేసే ఆఫీస్‌లో సైతం మగవారు ఉన్నారని అసలు రెస్ట్ రూమ్ వాడకుండా ఉగ్గబట్టుకుని ఇంటికి వచ్చాక మాత్రమే అవసరాలు తీర్చుకునే ఆడవారు ఉన్నారు. ఇక పీరియడ్స్ గురించి, శానిటరీ న్యాప్కిన్ల గురించి, menstural కప్ గురించి, సెక్స్ గురించి మాట్లాడాలంటే అదేదో బూతులా, లేదంటే పదిమంది ముందు మాట్లాడాల్సిన అంశాలు కావు అన్నట్టుగా ఫీల్ అవుతాం. ఇలాంటి దేశంలో ఇప్పుడు నో బ్రా డే గురించి నేను మాట్లాడినా చాలామంది తెల్లమొహాలు వేయటమో, ఛీత్కరించుకోవటమో చేసే అవకాశం లేకపోలేదు.

అసలు ఆడవాళ్లం బ్రాలు ఎందుకు వేసుకుంటాం ? చనుమొనలు కనబడకుండా... మహా అంటే breast sagging నుంచి తప్పించుకోవడానికి. ఆడది కనబడితే పైనుంచి కిందకి కళ్లతోనే స్కాన్ చేసే జనాలు ఉన్నారు. మనం బ్రా లు వేసుకున్నా వేసుకోకపోయినా నిప్పల్స్ ఇంప్రెషన్ కనబడినా కనబడకపోయినా చూసే వాళ్లు చూస్తూనే ఉంటారు. కళ్లతోనే కామం కక్కేవారు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఆడదాని ఎత్తులూ కొలతలూ చూసే వారు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు. కాబట్టి మనం బ్రాలను వేసుకోకపోయినా పెద్దగా భయపడక్కర్లేదు. జనాల చూపులకు embarrased గా ఫీలవ్వక్కర్లేదు. ఎందుకంటే వాళ్ల చూపులను నియంత్రించే రిమోట్‌లు మన చేతుల్లో లేవు.

ప్రపంచవ్యాప్తంగా మనం బ్రా లేకుండా గడిపేందుకు ఒక రోజు కేటాయించబడింది అని మీకు తెలుసా... ఆరోజు స్త్రీలు తమ బ్రాలను ఇంట్లోనే వదిలేసి braless గా తమ పనులు తాము చేసుకోవాలి. ఇలా చేయటంలో ముఖ్య ఉద్దేశం... బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన తీసుకురావటం, వక్షోజాల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం. ఛాతి క్యాన్సర్ గురించి అవగాహన తేవడం ఇంకా ఛాతి క్యాన్సర్ మీద రీసెర్చ్ చేయటానికి ఫండ్స్ రైస్ చేయటం.

ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న నో బ్రా డే పేరుతో పెద్దఎత్తున స్త్రీలు బ్రా లెస్‌గా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. పైగా ఈ సందడంతా అక్టోబర్ నెల మొత్తం నడుస్తుంది. పురుషులు కూడా ఈ నెల మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి భిన్న రకాలుగా అవగాహన కల్పించే బాధ్యత తీసుకుంటారు. చాలా స్వచ్ఛంద సంస్థలు దీనికి వేదిక అవుతాయి కూడా. పింక్ కలర్ థీమ్‌తో ఈ నెల చాలా ఈవెంట్స్ కూడా నిర్వహించి ఛాతీ క్యాన్సర్ మీద అవగాహనా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాల మంది.

బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన లేని స్త్రీలు, పురుషులు.... మీరు కరెక్టుగానే విన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పురుషుల్లో కూడా వస్తుంది. ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. సరే కనీసం సరైన అవగాహన తెచ్చుకోడానికి డాక్టర్‌ను సంప్రదిద్దామా అంటే మనకు ఏదైనా రోగం వస్తే తప్ప హాస్పిటల్‌కు వెళ్లలేం. ఇక కామన్ అవేర్నెస్ కోసం డాక్టర్‌ని మనం ఎలా సంప్రదిస్తాం. పోనీ గూగుల్‌లో చూద్దామా అంటే సగం ఇన్ఫర్మేషన్ అపోహలతో నిండి ఉంటుంది. అన్ని క్యాన్సర్లలోకెల్లా కాస్త సులభంగా తగ్గించగలిగే కాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినప్పటికీ మనం డిటెక్ట్ చేయటంలో ఆలస్యం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ప్రాణాలను మింగేస్తుంది.

ప్రతి నెలా మీ వక్షోజాలను గమనించుకోండి.. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చెక్ చేసుకోండి. ఇనీషియల్ స్టేజిలోనే గుర్తిస్తే చాలా ప్రాణాలను కాపాడుకోవచ్చు. మన దేశంలో చాల సున్నితమైన అంశాలను నార్మలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సున్నిత అంశాలను టీనేజ్‌లోకి ఎంటర్ అయిన పిల్లలకు అమ్మానాన్నలే చెప్తే బాగుంటుంది. సెన్సిటివ్‌గా ఉండే ఏ విషయమైనా మీ ద్వారా కాకుండా ఇంటర్నెట్ ఇంకా సమాజం ద్వారా పిల్లలు తెలుసుకుంటే చాలావరకు ఆ ఇన్ఫర్మేషన్ లేదా అవేర్నెస్ missuse అయ్యే అవకాశం ఉంది. ఇది మన శరీరం, మనం చనిపోయేవరకు దీన్ని కాపాడుకోవాలి. మన శరీరం గురించి మనం మాట్లాడగలగాలి. సందేహాలు ఉంటే తీర్చుకోవాలి. lets not be ignorant of our own health


అమ్మాయి కనిపించగానే మగాళ్లు ఫస్ట్ చూసే పార్ట్ ఇదే..! 


Similar News