Rain effect: వర్షాకాలం పిల్లల్లో, వృద్ధుల్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయా?ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?
సాధారణంగా వర్షాకాలంలో పిల్లలకు జ్వరాలు, దగ్గు, జలుబు వస్తుంటుంది.
దిశ, ఫీచర్స్: సాధారణంగా వర్షాకాలంలో పిల్లలకు జ్వరాలు, దగ్గు, జలుబు వస్తుంటుంది. అలాగే కొంతమందికి ఇన్‌ఫెక్షన్లు సోకడం, చెవిలోంచి చీము కారడం లాంటి పలు వ్యాధులు దరిచేరుతుంటాయి. అంతేకాకుండా మెదడు సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వాతావరణంలోని అధిక తేమ అండ్ దోమల పెరుగుదల అంటున్నారు. కాగా వృద్ధులు, పిల్లలు ఈ సమస్య బారిన పడే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, ఒరిస్సా, అస్సాం, త్రిపుర బిహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దోమల కారణంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు, ట్యూబర్‌క్యులర్, ప్రోటోజోల్, బ్యాక్టీరియా, ఫంగల్ వంటి ఎన్నో రకాల వ్యాధుల బారిన పడ్డారట. దీంతో చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారట.
బ్రెయిన్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు..
పిల్లల, వృద్ధుల మెదడులో ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో.. వాంతులు, తలనొప్పి, తీవ్రమైన జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. బాడీలోని ఇమ్యూనిటి పవర్ పూర్తిగా తగ్గిపోతుంది. మెదడు వీక్ అయిపోతుంది. తమకు తెలియకుండానే స్పృహ కోల్పోతారు. కాగా వర్షకాలంలో దోమల నివారణకు పలు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు యాంటీబయోటిక్స్‌తో నయం అయ్యే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ట్యూబర్‌కులర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్లకు చాలా కాలం యాంటీ ట్యూబర్‌క్యులోసిస్ డ్రగ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.