Health tips: బాడీ హీట్ ఎక్కువగా ఉందా..? ఇలా సహజంగా తగ్గించుకోండి..

నోటి పుండ్లు, హీట్ బాయిల్స్ అనేవి ఈ రోజుల్లో - Body Heat Reducing Remedy

Update: 2022-11-08 11:50 GMT

దిశ, ఫీచర్స్: నోటి పుండ్లు, హీట్ బాయిల్స్ అనేవి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. శరీరంలోని వేడి ఇందుకు ఒక కారణం కాగా.. ఇది వివిధ వ్యక్తులలో వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. 'అధిక శరీర వేడి అనేది పిత్త అసమతుల్యతకు సూచన. కాగా పెరిగిన శరీర ఉష్ణోగ్రత, ఎరుపు, సున్నితమైన చర్మం, నోటి పూతలు, వేడిని తట్టుకోలేకపోవడం, చెమటలు పట్టడం, గుండెల్లో మంట, లూజ్ మోషన్స్, కురుపులు, ఆమ్లత్వం, కోపం, చిరాకు వంటివి ఇందుకు రూపాలుగా వర్ణించారు కేరళ ఆయుర్వేద వైద్యురాలు (BAMS) డాక్టర్ అర్చన సుకుమారన్ వివరించారు.

శరీర వేడికి కారణమేమిటి..?

* వేడి, కారం, పులియబెట్టిన, ఉప్పు, నూనె లేదా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిత్త అసమతుల్యత ఏర్పడుతుంది. ఆల్కహాల్, కెఫిన్ పిత్త దోషాకి కారణమవుతాయి.

* సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల శరీరంలో వేడి పెరగడం మరియు పిత్త అసమతుల్యత ఏర్పడవచ్చు.

* అధిక శారీరక శ్రమ కూడా ఇందుకు కారణమే. కదిలే కండరాలు మరియు సంబంధిత రక్త ప్రసరణ చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.

నివారణకు రెమెడీ

8 గ్రాముల ధనియాలను దంచుకుని, 50 మి.లీ నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం, ఖాళీ కడుపుతో నీటిని వడకట్టి తాగాలి. ఈ రెమెడీ శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా బర్నింగ్ సెన్సేషన్, అధిక దాహాన్ని తగ్గించడం, బాడీని శుభ్రపరచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పిత్తదోషాన్ని బ్యాలెన్స్ చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.  

ఇవి కూడా చదవండి :

చెట్లకు పాయిజన్ సెలైన్స్.. ప్రపంచంలో ఖరీదైన కలప సృష్టికి.. 


Similar News