నీలిరంగు చీమలను ఎప్పుడైనా చూశారా.. అయితే ఈ ఫోటోపై లుక్ వేయండి

చీమలు ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక మన ఇంట్లోకి వచ్చే చీమలు రెడ్ కలర్, బ్లాక్ కలర్‌లోను ఉంటాయి. అందులో కొన్ని ఎర్ర చీమలని, మరికొన్నింటి నల్ల చీమలని మనం అంటూ ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా నీలి రంగు చీమలను చూశారా?

Update: 2024-06-05 09:07 GMT

దిశ, ఫీచర్స్ : చీమలు ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక మన ఇంట్లోకి వచ్చే చీమలు రెడ్ కలర్, బ్లాక్ కలర్‌లోను ఉంటాయి. అందులో కొన్ని ఎర్ర చీమలని, మరికొన్నింటి నల్ల చీమలని మనం అంటూ ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా నీలి రంగు చీమలను చూశారా? మీ ఇంటిలోకి వచ్చినప్పుడు కానీ, పంట పొలాల్లో కానీ వీటిని మీరు చూడటం జరిగిందా? ఏంటీ అసలు నీలిరంగు చీమలు కూడా ఉంటాయా? మీరు ఏం చెబుతున్నారు అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

భూమి మీద మొత్తం 16,724 రకాల చీమల జాతులు ఉన్నాయి. అందులో ఈ నీలిరంగు చీమలు కూడా ఒకటి. ఇవి చాలా స్పెషల్, ఎందుకంటే ఈ చీమలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయంట. అన్ని రకాల చీమల కంటే కాస్త భిన్నంగా ఇవి ఉంటాయి. వీటి తల త్రిభుజాకారంగా, కళ్లు పెద్దగా, నోరు , ఐదు దంతాలను కలిగి ఈ చీమలు ఉంటాయని పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే చాలా రోజులా వీటి జాడ అనేది లేదు. దీంతో చాలా మంది ఈ రకం చీమల జాతి అంతరించి పోయింది అనుకున్ నారు. కానీ తాజాగా వీటిని పరిశోధకులు గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ లోయలో నీలిరంగు చీమల జాతి ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

వందేళ్ల తర్వాత బెంగళూరుకు చెందిన అశోక జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ, ఫెరిస్ క్రియేషన్స్ లకు చెంది పరిశోధక బృధం సియాంగ్ లోకు వెళ్లి సర్వే చేసింది. అయితే అక్కడి మారుమూల యింకు గ్రామ ప్రాతంలోని ఓ చెట్టుపై 10 అడుగుల ఎత్తులో ఉన్న చిన్న రంధ్రంలో నీలి రంగు చీమలు ఉన్నట్లు వీరు తెలిపారు. ఇక వీటికి పారాపారాట్రెకినా నీల అని నామకరణం కూడా చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఈ నీలిరంగు చీమకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Similar News