Black Spots: వీటితో బ్లాక్ స్పాట్స్ ఈజీగా మాయం చేయవచ్చు!
కొంత మంది అమ్మాయిలు నల్లటి మచ్చలు మొఖం మీద ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
దిశ, వెబ్ డెస్క్ : కొంత మంది అమ్మాయిలు నల్లటి మచ్చలు మొఖం మీద ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఈ డార్క్ స్పాట్స్ రావటానికి అనేక కారణాలు వున్నాయి. ముఖ్యంగా సూర్య కిరణాలు , కాలుష్యం, హార్మొన్ల ప్రభావం వల్ల ముఖం పై నల్లని మచ్చలు ఏర్పడతాయి. మీరు ముఖం పై డార్క్ స్పాట్స్ ను పూర్తిగా తొలగించాలనుకుంటే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి.
నీరు
ముఖం పై ఉన్న నల్లటి మచ్చలు పోవాలంటే నీటిని ఎక్కువ తీసుకోవాలి. అధికంగా నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న టాక్సీన్లు సులభంగా బయటికి పోతాయి. నీరు తాగటంతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
నిమ్మరసం
ముఖం పై ఉన్న నల్ల మచ్చలు తొలగించటంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఏజెంట్‌గా మారి పని చేస్తుంది.పెరుగులో నిమ్మరసం కలిపి మొఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల నల్లటిమచ్చలు తగ్గుతాయి.
కలబంద
కలబంద చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబందలో వుండే అమైనో అమ్లాలు, విటమిన్లు చర్మ సమస్యలను తొలగిస్తాయి. అలాగే డార్క్ స్పాట్స్‌ను దూరం చేస్తాయి.
ఇవి కూడా చదవండి : Jurrassic: జూరాసిక్ యుగం నాటి ‘జెయింట్ కీటకం’ మళ్లీ కనిపించింది !