Lips: పెదవుల చుట్టూ నల్లగా ఉందా.. అయితే, ఈ చిట్కాలను పాటించండి
ఈ బ్లాక్ పిగ్మెంటేషన్‌ను ఫేస్ ని మొత్తం పాడు చేస్తుంది.
దిశ, ఫీచర్స్ : అమ్మాయిల ముఖంలో పెదవులే అందం. కానీ, కొందరి పెద్దాల చూట్టూ నల్లగా ఉంటుంది. దీని వలన చాలా మంది బయటకు రావాలన్న కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ బ్లాక్ పిగ్మెంటేషన్‌ను ఫేస్ ని మొత్తం పాడు చేస్తుంది. వీటిని ఎర్రగా చేసుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే, కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..
పీరియడ్స్ టైమ్ లో హార్మోన్స్ లో మార్పులు వస్తుంటాయి. దీని వలన చర్మం నల్లగా మారుతుంది. అన్ వాంటెడ్ హెయిర్ తీసే సమయంలో జాగ్రత్తలు తీసుకోరు. అప్పుడు పెదవుల చుట్టూ చర్మం నల్లగా అవుతుంది.
పెదవులను ఎర్రగా మార్చే చిట్కాలు
1. పెదవుల చుట్టూ ఉన్న బ్లాక్ స్కిన్ కి తేనె రాయండి. ఇలా వారం రోజుల పాటు తేనెను రాసి 10 నిమిషాలు అలాగే ఉంచుకుని తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత పెదవులు ఎర్రగా మారతాయి.
2. లెమన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని వాడితే రోజూ చుట్టూ రుద్దుతూ ఉండండి. ఇలా పెదాలపై రాసి 8 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
3. బంగాళాదుంప మనం నిత్యం తింటూనే ఉంటాం.. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా అందానికి కూడా పని చేస్తుంది.
దీన్ని ఉడికించి పేస్ట్ లా చేసుకుని ఆ తర్వాత నల్ల పెద్దాల చుట్టూ రాయండి కొద్దీ రోజుల్లోనే తేడా తెలుస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.