బెస్ట్ ఎనర్జీ బార్స్ రెసిపీ.. పిల్లలు, పెద్దలు మార్నింగ్ తింటే ఎనర్జీతో పాటు ఆ సమస్య దూరం!
జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఆరోగ్యం ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఆరోగ్యం ఒకటి. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసికంగా, శారీరకంగా యాక్టివ్‌గా ఉంటాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. కాగా జబ్బు బారిన పడకముందే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు పలు చర్యలు తీసుకోవాలి. వ్యాయామాలు చేయాలి. నాణ్యమైన ఫుడ్ తీసుకోవాలి.
సరైన ఫుడ్ తీసుకోకపోవడం కారణంగా, వ్యాయామాలు చేయకపోవడం వల్ల ఎంతో మంది గుండె జబ్బులు, మధుమేహం అండ్ క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక అసంక్రమిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రోజంతా ఎనర్జీగా ఉండటం కోసం ఆరోగ్య నిపుణులు బెస్ట్ ఎనర్జీ బార్స్ రెసిపీ తీసుకోవాలని సూచించారు. ఉదయాన్నే ఇది తీసుకోవడం వల్ల పిల్లల్లో, పెద్దల్లో పోషక లోపం రాదని చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి ఈ ఎనర్జీ బార్ ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ఇందుకోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఈ ఎనర్జీ బార్ శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. మార్నింగ్ పూట ఒక్క బార్ తింటే బాడీకి కావాల్సిన అనేక పోషకాలు అందుతాయి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎనర్జీ బార్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
కప్పు ఎండు ఖర్జూరం, సగం కప్పు బాదాం, పావు కప్పు వాల్‌నట్, కప్పు జీడిపప్పు, పావు కప్పు పల్లీలు (వేయించినవి), పావు కప్పు ఉప్పులేని పిస్తా, పావు కప్పు గుమ్మడి గింజలు, సగం కప్పు తేనె, పావు టీస్పూన్ యాలకుల పొడి, సగం కప్పు ఓట్స్, పావు కప్పు నువ్వులు తీసుకోవాలి.
తయారీ విధానం..
ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. తర్వాత హాట్ వాటర్‌లో ఖర్జూరం వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. అనంతరం వాటిని మెత్తగా మిక్స్ పట్టాలి. ఇప్పుడు కడాయి తీసుకుని స్టవ్ సిమ్‌లో పెట్టి.. జీడిపప్పు నువ్వులు, గుమ్మడి గింజలు, వాల్ నట్, పిస్తా, బాదాంపప్పు, పల్లీలు అన్ని ఒకేసారి వేయించుకోండి. ఇవన్నీ పక్కన పెట్టి సెపరెట్‌గా ఓట్స్ వేయించండి. తర్వాత వీటిని మిక్స్ పట్టండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఖర్జూరం ముద్ద కడాయిలో వేసి చిక్కబడేవరకు కలపండి.
పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి అందులో యాడ్ చేసి కలపాలి. ఇందులో తేనె వేయండి. షుగర్ అవసరం లేదు.తర్వాత ఓట్స్ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చల్లారాక గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోండి.గట్టిగా అయ్యాక చాకుతో పొడవాటి ముక్కల్లాగా కట్ చేసుకుంటే అంతే ఎనర్జీ బార్స్ తయారు అయిపోయినట్లే. ఇది పిల్లలు, పెద్దలు తింటే రోజంతా ఎనర్జీ మీ సొంతం అవుతుంది. పోషక లోపం దూరం అవుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...