కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుట్టరు.. అయినా ఎందుకు తినాలి?
గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడుతారని అంటారు పెద్దలు. కానీ ఇదంతా అపోహ అని.. శిశువు చర్మం రంగును మార్చే గుణాలు ఇందులో లేవని చెప్తారు నిపుణులు. పుట్టబోయే బిడ్డ కలర్ తల్లిదండ్రుల జీన్స్ పై
దిశ, ఫీచర్స్: గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడుతారని అంటారు పెద్దలు. కానీ ఇదంతా అపోహ అని.. శిశువు చర్మం రంగును మార్చే గుణాలు ఇందులో లేవని చెప్తారు నిపుణులు. పుట్టబోయే బిడ్డ కలర్ తల్లిదండ్రుల జీన్స్ పై ఆధారపడుతుందని వివరిస్తారు. అయినా సరే పెగ్నెన్సీ సమయంలో వైద్యులు సాఫ్రాన్ తీసుకోవాలని సలహా ఇస్తారు. ఎందుకు? ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
1. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తల్లి, బిడ్డ పూర్తి సంరక్షణకు సాయపడతాయి. ఈ సమయంలో మదర్ వాపుతో బాధపడుతున్నట్లయితే ఉపశమనం కలిగిస్తుంది.
2. కుంకుమ పువ్వు మలబద్ధకాన్ని నివారిస్తుంది. సాధారణంగా గర్భిణులు ఈ సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. పాలు లేదా గంజిలో దీన్ని కలుపుకుని తీసుకున్నట్లయితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యల నుంచి రిలీఫ్ అవుతారు.
3. ఈ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుంది. కాబట్టి యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు కలిగిన కుంకుమ పువ్వు మానసిక కల్లోలాన్ని నివారించి ప్రశాంతతను ఇవ్వడంలో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు నిపుణులు.
4. మొదటి మూడు నెలల్లో వచ్చే ప్రధాన సమస్యలలో మార్నింగ్ సిక్‌నెస్ ఒకటి. కాగా ఒక మోస్తరు పరిమాణంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ఆ ఫీలింగ్ తగ్గుతుంది. వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. కుంకుమపువ్వు గర్భధారణ సమయంలో రక్తపోటు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.
6. బిడ్డ కడుపులో పెరిగేకొద్దీ, తల్లి శరీర కండరాలు విస్తరిస్తాయి. ఈ ప్రక్రియలో తల్లికి వెన్ను, కడుపు, కాళ్ళలో తీవ్రమైన తిమ్మిరి, నొప్పి వస్తుంది. ఈ బాధాకరమైన సమయంలో కుంకుమపువ్వును మితంగా తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
7. గర్భధారణ సమయంలో తల్లులు రక్తహీనతను ఎదుర్కోవచ్చు. అందుకే ఐరన్-రిచ్ ఫుడ్, సప్లిమెంట్లను తీసుకోవాలని సూచిస్తారు డాక్టర్స్. కాగా రోజూ కొంత మొత్తంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిలను సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతారు. ఆరోగ్యంగా ఉంటారు.
8. హార్మోన్ల మార్పులు, పొట్ట పెరగడం, శ్వాస ఆడకపోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత గర్భిణులకు అలసిపోయినట్లు అనిపించవచ్చు. అలాంటప్పుడు పడుకునే ముందు కుంకుమపువ్వు పాలు తీసుకుంటే ప్రశాంతంగా నిద్రపోతారు. అలసట ఉండదు.
9. గర్భం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. కుంకుమపువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాతావరణంలో మార్పులు, ఇతర సాధారణ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించబడతారని చెప్తున్నారు నిపుణులు.
నోట్ : కుంకుమ పువ్వు పాలు తీసుకునేటప్పుడు మీ గైనకాలజిస్ట్ సలహా తప్పనిసరి. ఎంత మోతాదులో తీసుకోవాలనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఆందోళన, వికారం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అందుకే సొంత ప్రయోగాలు మానాలని సూచిస్తున్నారు నిపుణులు