ఎర్ర క్యాబేజీతో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో చూడండి
మానవ శరీరానికి నాన్ వెజ్ కంటే.. కూరగాయాలే చాలా మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే కొందరు పూర్తిగా మాంసహారాన్ని మానేసి శాఖాహారం వైపు అడుగులు వేస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : మానవ శరీరానికి నాన్ వెజ్ కంటే.. కూరగాయాలే చాలా మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే కొందరు పూర్తిగా మాంసహారాన్ని మానేసి శాఖాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల్లో మన కంటి చూపును కాపాడే వాటిలో ప్రధానమైంది రెడ్ క్యాబేజీ. దీన్ని తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెడ్ క్యాబేజీలో మనకు పని కొచ్చే ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇందులో విటమిన్ 'సీ' అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్లు, మినరల్స్ అధికంగానే ఉంటాయి.
ముఖ్యంగా రక్తం గడ్డ కట్టేలా చేసి అధిక బ్లీడింగ్ ఆగేలా చేస్తుంది. ఈ క్యాబేజీలో విటమిన్ 'ఎ' కూడా ఉంటుంది. కంటి చూపును మెరుగుపస్తూనే అధిక రక్తపోటు నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మల బద్ధకాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గించేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా చేసే గుణం ఇందులో ఉంది. క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. రక్త నాళాల్లో పూడికలు రాకుండా చేస్తుంది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గేలా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:: మొలకెత్తిన వెల్లుల్లితో ఈ ప్రాణాంతకర వ్యాధులకు చెక్ పెట్టొచ్చు