ఆపిల్ కాదు.. రోజుకు ఒక క్యారెట్‌ను తినండి.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
శీతాకాలంలో చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : శీతాకాలంలో చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. జలుబు, దగ్గు, జ్వరం, చర్మం పగుళ్లు, జుట్టురాలడం, అజీర్తి ఇలా ఎన్నో ఎదుర్కొవలసి ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఎన్నో ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తూ ఉంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శీతాకాలంలో దొరికే హెల్తీ ఫుడ్ తీసుకోకపోతే వృథానే. శీతాకాలంలో ఎన్నో రకాల కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఒకటే క్యారెట్. క్యారెట్‌లో ఏ, బీ, సీ, కే విటమిన్లు, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉన్నాయి. అందుకే ఈ క్యారెట్‌తో చేసిన పదార్థాలను తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
ప్రతినిత్యం క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. క్యారెట్‌లో ఉండే బీటా - కెరోటిన్‌లు, విటమిన్ సీ చర్మకణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే క్యారెట్‌లో ఉండే విటమిన్ ఏ స్కిన్ క్లియర్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది. క్యారెట్‌లో ఉండే పోటాషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, సీ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ ప్రతిరోజు తాగితే రక్తంలోని షుగర్ లెవల్‌ని కంట్రోల్ చేస్తుంది.
అంతేకాక శరీరానికి కావలసిన ఫైబర్‌లో 40 - 50 శాతం వరకు అందిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆకలి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇక క్యారెట్‌లో ఉండే బీటా - కెరోటిన్‌ను మానవ శరీరం విటమిన్- ఎ గా మార్చుకుని యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుపడుతుంది.